పాన్ వరల్డ్ లెవెల్‌లో సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూసిన మోస్ట్ ఆవైటెడ్ కల్కి 2898 ఏడి తాజాగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కొద్దిగా సేపటి క్రితం థియేటర్లో గ్రాండ్ రిలీజై మొదటి రెండు షోలను పూర్తి చేసుకుంది. ఇప్పటికే సినిమాను చూసిన వారంతా సినిమాపై ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ విజువల్స్, తెలివైన డైరెక్షన్.. అద్భుతమైన కంటెంట్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భారీ లెవెల్ లో పాజిటివ్ టాక్ వినిపించింది. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటూ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక భారీ తారాగణం అంతా ఈ సినిమాలో కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే.. అమితాబచ్చన్, కమలహాసన్, దీపిక పదుకొనే కీలక పాత్రలో నటిస్తున్నారు. కాకుండా టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాలో నటించారంటూ గతంలో వార్తలు వినిపించాయి. అయితే గతంలో వచ్చిన వార్తలను నిజం చేస్తూ రాజమౌళి ఎంట్రీ థియేటర్లో ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ కంటే ఎక్కువగా రాజమౌళి ఎంట్రన్స్ వీడియో లు మారుమోగిపోతున్నాయి. ఫస్ట్ షాప్ లో రేయ్ భైరవ మళ్లీ దొరికావంటే ఈసారి పదేళ్లు తొక్కేస్తా అంటూ డైరెక్టర్ రాజమౌళి పవర్ ఫుల్ డైలాగ్.. ఎంట్రీ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది అంటున్నారు.
దీనికి సంబంధించిన ఓ మినీ వీడియోను అభిమాని పోస్ట్ చేస్తూ.. ఇప్పుడే కల్కి సినిమాను చూసాం.. వావ్ అంతే.. ఇలాంటి విజువల్ వండర్ ఇప్పటివరకు అస్సలు చూసి ఉండరు. అమితాబ్, కమల్ హాసన్ అయితే సినిమాలో అద్భుతంగా జీవించారు. వారి క్యారెక్టర్ ఎంతో కీలకంగా ఉన్నాయి. సినిమాల్లో సర్ప్రైజ్ ల పైన సర్ప్రైజ్లు ఉంటాయి అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నాగ అశ్విన్ పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. సినిమా కచ్చితంగా థియేటర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. నాగ అశ్విన్ తోపు భయ్య అంటూ.. ఒరేయ్ అన్నయ్య బాహుబలి తీసిన డైరెక్టర్ని కూడా వదలలేదా అంటూ.. ఇలా ఎన్నో రకాల కామెంట్స్‌తో రాజమౌళి వీడియోను తెగ ట్రెండ్ చేస్తున్నారు.
Orey aayana Bahubali teesina director ni kuda pettesava 🤣❤️🔥🔥🔥🔥#Kalki2898AD #Prabhas #Kalki
pic.twitter.com/CFkK4XYalJ— 😎SRIKANTH_PSPK_49😎 (@Srikant01910268) June 26, 2024