ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో ఎక్కువగా వైరల్ గా మారింది. మనకు తెలిసిందే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన సినిమా కల్కి . ఈ సినిమాపై బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు ఫ్యాన్స్ . అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా నుంచి సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశాడు. అయితే ఇది ఓ విజువల్ వండర్ అని సెకండ్ ట్రైలర్ తో బాగా తెలుస్తుంది . మరి ముఖ్యంగా మంచి కోసం మహాభారతంలో కురుక్షేత్రం జరిగితే ఏమవుతుంది అని చెప్పే మూవీనే ఈ కల్కి . కలియుగంలో యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో నాగ్ అశ్వీన్ ఈ కథను సిద్ధం చేశారు . ట్రైలర్ లో చూపిన దాని ప్రకారం భూమి మీద ఉన్న అన్ని వనరులు అయిపోతే.. పాపాలు పెరిగిపోతే ఆ తరుణంలోనే మహా విష్ణువు కల్కిగా అవతరిస్తాడు .
అయితే మనకు ఈ సినిమాలో సుమతిగా నటిస్తున్న దీపికా పదుకొనే కడుపున కల్కి జన్మించబోతున్నట్లు ట్రైలర్ లో చూపిస్తారు . అంతవరకు ఓకే మరి కల్కి ప్రభాస్ కానప్పుడు ప్రభాస్‌కి అంత వాల్యూ ఉంటుందా ..? ఈ సినిమాలో అనే విషయంపై కూడా ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు . ఈ సినిమాలో భైరవ పాత్రలో కనిపించబోతున్నాడు ప్రభాస్, అయితే తాజాగా సెకండ్ ట్రైలర్ లో క్రేజీ క్రేజీ హింట్ వదిలాడు నాగ్ అశ్వీన్. బైరవ నే కల్కి అంటూ ఆ హింట్ ఆధారంగా తెలుస్తుంది. సుమతీని పట్టుకునేందుకు భైరవ ప్రయత్నిస్తూ ఉంటాడు ..కాపాడేందుకు అశ్వద్ధామ ప్రయత్నిస్తూ ఉంటారు .
ఈ క్రమంలోనే భారీ ఫైట్ జరుగుతుంది . ఆ ఫైట్‌లో అశ్వద్ధామ అని ఒక గుద్దు గుద్దితే ఆమడ దూరంలో పోయి పడిపోతాడు .. ఆ దెబ్బ రుచికి అశ్వద్ధామ కి కురుక్షేత్ర యుద్ధం గుర్తుకు వచ్చేస్తుంది. భైరవ గుద్దినంత బలంగా ఆ కురుక్షేత్రంలో అశ్వద్ధామను ఎవరో కొట్టినట్లుగా చూపిస్తారు. సీన్ కట్ చేస్తే ఆ ఫోర్స్ కి ఏనుగు కూడా కదిలిపోతుంది .. అయితే ఆ భైరవ నే ఈ కల్కి అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . కురుక్షేత్ర యుద్ధంలో అశ్వద్ధామను కొట్టిన వ్యక్తి మళ్ళీ భైరవగా పుట్టాడా ..?
కురుక్షేత్రంలో అశ్వద్ధామ ని కొట్టింది ఎవరు..? కృష్ణుడా..? భీముడా ..? అర్జునుడా..? మహాభారతంలో అశ్వద్ధామ గా ఎవరు యుద్ధం చేశారు ..? అనే విషయాలను బాగా పరిశీలిస్తే క్లారిటీ వస్తుంది. అయితే ఒకటి మాత్రం నిజం మనం అనుకున్నట్లు ప్రభాస్ సినిమాలో కేవలం భైరవ పాత్రలో మాత్రమే కనిపించడం లేదు . ఏదో సస్పెన్స్ పెట్టే వచ్చాడు . అలా అయితే సుమతి గర్భంలో ఉన్నది ఎవరు ఇది ఒక కన్ఫ్యూషన్ గా మారిపోయింది . ఈ సినిమా రిలీజ్ అయితేనే అన్నిటికి క్లారిటీ వస్తుంది..??