“నా మొగుడు నాకు కావాలి”.. పవన్ కళ్యాణ్ పై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఫ్యాన్స్ షాక్..!

సోషల్ మీడియాలో యమ ఆక్టివ్ గా ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది . రేణు దేశాయ్ ఈ మధ్యకాలంలో ఏ పోస్ట్ పెట్టిన సరే అది సెకండ్స్ లోనే వైరల్ గా మారిపోతుంది. ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఇచ్చి పడేస్తూ వచ్చే రేణు దేశాయ్ .. అకీరానందన్ ఆద్యల విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో మనకు తెలిసిందే. అయితే అకీరానందన్ ను పవన్ కళ్యాణ్ కు బాగా దగ్గర చేసేసింది . మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవుతున్నాడు అఖీరానందన్ .

ఎక్కడికి వెళ్ళినా సరే తండ్రి పక్కనే ఉంటూ హైలెట్ గా మారాడు . కాగా త్వరలోనే తెలుగు ఇండస్ట్రీలో అకిరానందన్ సినీ ఎంట్రీ ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . కాగా రీసెంట్గా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు కొత్త డౌట్లు పుట్టిస్తుంది . ఇక ఈ వీడియోలో తన మాజీ భర్త ఆయన పవన్ కళ్యాణ్ ను ఆమె మరొకసారి గుర్తు చేసుకోవడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

“నా ఈ ఐఫోన్ లో భోగిమంట స్లో మోషన్ లో చిత్రీకరించాను.. మీకోసమే డిసెంబర్ నుంచి ట్రిప్ చేస్తూనే ఉన్నాను .. నేను ఇంకా నా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయలేదు అన్న సంగతే మర్చిపోయాను.. నా మాజీ భర్త ను ఎలా తిరిగి పొందాలి లేక ఇప్పటికి అతన్ని కోల్పోతున్నాను అని మీరు భావిస్తున్నందుకు నేను ఈ పోస్ట్ ని ఎలా ఉంచాను అనే దాని పైన అసభ్యకరమైన కామెంట్లు గాని లేక అభిప్రాయాలు గాని వ్యక్తం చేస్తే డిలీట్ చేసేస్తా లేదంటే బ్లాక్ చేసేస్తా “అంటూ కూసింత ఘాటుగా ముందుగానే పవన్ ఫ్యాన్స్ ని హెచ్చరిస్తూ నోట్ చేసింది . దీంతో ఆమె పోస్ట్ వైరల్ గా మారింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)