ఫ్రెండ్షిప్ .. చాలామంది చాలా జెన్యూన్ గా చేస్తారు.. ఎవరో కొంతమంది మాత్రమే స్వార్థపూరితంగా చేస్తూ ఉంటారు . అయితే సినిమా ఇండస్ట్రీలో సైతం మంచి జాన్ జిగిడి దోస్త్ ఫ్రెండ్షిప్ ఉన్న హీరోస్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు . ఆ లిస్టులోకే వస్తారు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . ఎప్పుడు పరిచయం ఏర్పడిందో ..? ఎలా అది ముందుకెళ్లిందో..? ఎంత స్ట్రాంగ్ బాండింగ్ కుదిరిందో ..? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .
వీళ్ళిద్దరిని చూసి చాలా చాలా మంది ఈర్ష్య పడుతుంటారు. మాకు ఇలాంటి ఫ్రెండ్ దొరకలేదే అని బాధపడుతూ కూడా ఉంటాడు. పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ ఎంత ఇంపార్టెంటో ..త్రివిక్రమ్ కి పవన్ కళ్యాణ్ కూడా అంతే ఇంపార్టెంట్..వీళ్లది ఫ్రెండ్షిప్ అనకూడదు అంతకుమించే అనే చెప్పాలి . అయితే రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందారు . డిప్యూటీ సీఎం గా కూడా మారారు .
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ జాన్ జిగిడి దోస్త్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తన ఫ్రెండ్ ఇంత మంచి స్ధానాని అందుకున్న సందర్భంగా ఏకంగా తిరుమల శ్రీవారికి నడుచుకుంటూ వెళ్లారు . ఆయన భార్య సౌజన్య కొడుకుతో కలిసి తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టం బాసు అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు పవన్ ఫ్యాన్స్ . మరికొందరు మాత్రం వీళ్ళ ఫ్రెండ్షిప్ ను ద్వంద అర్థాలతో చూస్తున్నారు..!!