పుష్ప 2 ఆఫర్ రిజెక్ట్ చేసిన విజయ్ సేతుపతి.. క్లారిటీ ఇదే..?!

గత కొంతకాలంగా వరుస‌ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న ప్రముఖ నటులలో విజయ్ సేతుపతి ఒకరు. గత ఆరేళ్లలో విజ‌య్ ఏకంగా 25 సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే తాజాగా విజయ్ ప్రధాన పాత్రలో నటించిన మహారాజ సినిమా రిలీజై మంచి సక్సెస్ సాధించింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న విజయ్.. తనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇందులో భాగంగానే పుష్ప 2 మూవీ ఆఫర్‌ను మీరు రిజెక్ట్ చేశారా అంటూ విజయ్ సేతుపతికి విలేక‌రు నుంచి ప్ర‌శ్న ఎదురయింది.

Maharaja (2024) - IMDb

దీనిపై ఆయన రియాక్ట్ అవుతూ చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారాయి. ఆ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ మహారాజ సినిమా విషయంలో నేను ఏది ప్లాన్ చేయలేదని.. అలా కుదిరిపోయాయంటూ చెప్పుకొచ్చాడు. సినిమాలో అనురాగ కాస్య‌ప్‌ బాగా నటించారని.. సెల్వం పాత్రలో ప్రేక్షకులందరికీ తెలిసిన వ్యక్తి నటిస్తే ఆ పాత్ర పై అంత ప్రభావం ఉండేది కాదని విజయ్‌ చెప్పుకొచ్చాడు. తెలుగు సినిమాల్లో నటించడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నానని.. అయితే వారెవరు తెలుగు ఆఫర్‌లు నాకు ఇవ్వటం లేదంటూ చెప్పుకొచ్చాడు. పుష్ప 2 సినిమా ఆఫర్ నేను రిజెక్ట్ చేయలేదని వివరించాడు. అయితే జీవితంలో అన్నిసార్లు నిజం చెప్పకూడదని.. ఇప్పుడు నేను నిజం చెప్పా.. కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పడం మంచిది అంటూ విజయ్ సేతుపతి ఫ‌నీ కామెంట్ చేశాడు.

ఇక చరణ్, బుచ్చిబాబు కాంభో సినిమాలో తను నటించడం లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. నాకు రొమాంటిక్ హీరోగా నటించడం అంటే చాలా ఇష్టమని చెప్పిన విజయ్ సేతుపతి.. మహారాజ సినిమాకు సీక్వెల్ లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం భారీ రెమ్యున‌రేష‌న్‌ తీసుకుంటున్న వారిలో విజయ్‌ సేతుపతి కూడా ఒకరు. తాజాగా మహారాజా సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న విజయ్ ఫ్యూచర్‌లో త‌న సినిమాల‌తో ఎలాంటి సక్సెస్‌లు అందుకుంటాడో వేచి చూడాలి. అయితే ఇప్పటికే పలు టాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి మెపించిన విజయ్ సేతుపతి.. రోజు రోజుకు అభిమానులను మ‌రింత‌గా పెంచుకుంటున్నాడు.