అసలు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది..? ప్రశ్నించే పెద్దదిక్కే లేదా..?

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . అసలు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది..? ఎందుకు ఫ్యాన్స్ ఈ విధంగా తయారయ్యారు ..? ఒక హీరో ఫ్యాన్స్ మరొక హీరో ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తూ ఉంటే సదరు హీరో ఫ్యాన్స్ నోరెత్తి మాట్లాడరా..? ఇది తప్పు అని చెప్పరా..? ఒక హీరో కెరియర్ని నాశనం చేసేస్తారా? ఒక హీరో ఇంకొక హీరోకి సపోర్ట్ చేయకపోతే ఇండస్ట్రీలో నుంచి గెంటి వేస్తారా..? ఇంత దారుణంగా పరిస్థితులు తయారవుతున్నాయా..?

ఇండస్ట్రీకి పెద్దదిక్కు అంటూ ఎవ్వరూ లేరా ..? ఇలాంటి కామెంట్స్ తో బన్నీ ఫాన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు . గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బన్నీని ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ బన్నిని ఏ విధంగా టార్గెట్ చేశారు ..అందరికీ తెలిసిందే. అయితే బన్నీని ఈ రేంజ్ లో టార్చర్ చేస్తున్న కూడా మెగా ఫ్యామిలీ నోరెత్తి ఏమీ మాట్లాడడం లేదు అటు మెగాస్టార్ చిరంజీవి ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం సైలెంట్ గా తమ పనులు తాము చూసుకుంటున్నారు .

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోని మిగతా హీరోలు సైతం మెగా ఫాన్స్ చేస్తున్న పనిపై ఫుల్ ఫైర్ అయిపోతున్నారు . వాళ్లకు వాళ్లకు ఎన్నైనా ఉండొచ్చు.. కెరియర్ పరంగా ఒక హీరో లైఫ్ ను స్పాయిల్ చేస్తారా ..? పుష్ప2 లాంటి సినిమా వాయిదా వేసుకుంది అంటే కారణం వాళ్ళు చేసే ట్రోలింగ్.. వాళ్ళు ఇచ్చే బెదిరింపు కారణంగానే ఈ సినిమా వాయిదా పడింది . అసలు ఇంత స్థాయికి ఎందుకు తీసుకొచ్చారు మెగా ఫ్యామిలీ అంటూ మండిపడుతున్నారు . ఇండస్ట్రీకి ఒక పెద్దదిక్కు ఉండాలి అని అప్పుడే ఇలాంటి ట్రోలింగ్ జరుగుతున్నప్పుడు ఆ పెద్ద మనుషులు సరైన నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది..!!