“దయచేసి అలాంటి పని చేయద్దు”.. ఫ్యాన్స్ కి జాన్వీ కపూర్ స్పెషల్ రిక్వెస్ట్..!

జాన్వి కపూర్ .. శ్రీదేవి కూతురుగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . అయితే శ్రీదేవి అంతటి స్థానం మాత్రం దక్కించుకోలేకపోతుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె అంటే పడి చచ్చిపోయే జనాలు చాలామంది ఉన్నారు . కానీ ఆమె నటించిన సినిమాలు మాత్రం బోల్తా కొడుతూనే వస్తున్నాయి. చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఇప్పటికీ సరైన హిట్ తన ఖాతాలో వేసుకోలేకపోయింది ఈ అందాల ముద్దుగుమ్మ .

తెలుగులో దేవరా సినిమాతో డెబ్యూ ఇస్తుంది. కచ్చితంగా ఈ సినిమా ఘన విజయం సాధిస్తుంది అన్న ధీమా వ్యక్తం చేస్తుంది. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన కూడా ఒక సినిమాలో సెలెక్ట్ అయింది. కాగా జాన్వి కపూర్ తన ఫాన్స్ కు స్పెషల్ రిక్వెస్ట్ చేసింది . జాన్వి కపూర్ పేరుతో ఉన్న ఓ ఫేక్ అకౌంట్లో అసభ్యకరమైన పోస్ట్లు దర్శనం ఇవ్వడంతో జాన్వి కపూర్ టీం స్పందించింది . డిజిటల్ మీడియా బాగా పెరిగిపోతుంది ..అందుకే స్టార్ సెలబ్రిటీస్ పేర్లు చెప్పి రకరకాల పాడు పనులకు పాల్పడుతున్నారు కొందరు జనాలు.

దయచేసి అలాంటి మోసాలకు గురవ్వకండి.. ఫేక్ అకౌంట్లను ప్రోత్సహించకండి.. వాటిని ఫాలో కావొద్దు అంటూ జాన్వి కపూర్ స్పందించింది . జాన్వి కపూర్ ఎంత బిజీగా ఉన్నా సరే ఫాన్స్ తో నిరంతరం టచ్ లో ఉండనే ఉంటుంది. కాగా జాన్వి కపూర్ క్రేజ్ ఉపయోగించుకోవాలని చూస్తున్న కొందరు ఆకతాయిలు ఆమెతో ఆమె పేరుతో కొన్ని అసభ్యకరమైన పనులు కూడా పాల్పడుతున్నారు. దీంతో అలర్ట్ అయిన జాన్వీ కపూర్ ఫ్యాన్స్ ని అలాంటి పనులు చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేసింది..!!