పెళ్లి చేసుకోబోతున్న మరో యంగ్ హీరోయిన్.. భలే షాక్ ఇచ్చిందే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో ఎంతమంది కత్తిలాంటి ఫిగర్లున్న సరే సోనాక్షి సిన్హాకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . బొద్దుగా ఉన్నా సరే అవలీలగా బాడీని ఊపుతూ డాన్స్ చేసేస్తుంది .. చాలా చాలా కష్టమైన రోల్స్ ని కూడా అవలీలగా నటించగలరు. అలాంటి ఓ టాలెంటెడ్ యాక్టర్ చాలా చాలా మంచి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సోనాక్షి సిన్హా.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది .

సోషల్ మీడియాలో గత కొంతకాలంగా ఆమె నటుడు జహీర్ ఇగ్బాల్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు వార్తలు వినిపించాయి . అయితే ఎక్కడా కూడా తన ప్రేమ విషయాన్ని డేటింగ్ విషయాన్ని ఓపెన్ గా చెప్పలేదు . రీసెంట్గా సోషల్ మీడియాలో వీళ్ళు కలిసి దిగిన ఫొటోస్ అలాగే వీళ్ళ బ్యాచిలర్ పార్టీకి సంబంధించిన ఫొటోస్ వైరల్ గా మారాయి . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు సోనాక్షి సిన్హా పెళ్లి వార్త వైరల్ గా మారింది .

అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 23వ తేదీ వీరిద్దరు గ్రాండ్గా పెళ్లి చేసుకోబోతున్నారట . ఇన్నాళ్లు డేటింగ్ చేసిన ఈ లవ్ బర్డ్స్ ఇప్పుడు భార్యాభర్తలు గా మారబోతున్నారట . ఇప్పటికే బ్యాచిలర్ పార్టీస్ కూడా పూర్తి చేసుకున్నారట. ఆ తర్వాత పద్ధతి ప్రకారం వెళ్లి పెళ్లి చేసుకోబోతున్నారట . సోషల్ మీడియాలో ఇప్పుడు సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్ రొమాంటిక్ ఫొటోస్ బ్యాచిలర్ ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. మరో అందమైన బ్యూటీ కూడా పెళ్లి చేసుకొని ఆంటీ లిస్టులోకి ఆడ్ అయిపోతుంది అంటూ ఫ్యాన్స్ ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు..!!