గుట్టు చప్పుడు కాకుండా ఎంగేజ్ మెంట్ చేసుకున్న ప్రదీప్..అమ్మాయి ఎవరో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ అందరూ సైలెంట్ గా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు . మరి ముఖ్యంగా కొంతమంది స్టార్స్ అయితే చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసుకొని ఫోటోలతో షాక్ ఇస్తున్నారు . తాజాగా అలాగే చేశాడు నటుడు ప్రదీప్ . ప్రదీప్ అనగానే ముందుగా తెలుగు జనాలకు యాంకర్ ప్రదీప్ గుర్తొస్తాడు .. అయితే ఇక్కడ ప్రదీప్ అంటే తెలుగు యాంకర్ కాదు ..తమిళ నటుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రదీప్ ఆంటోనీ..

ఇతగాడు త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు ..తన ప్రేయసి మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నాడు .. జూన్ 16వ తేదీ తన గర్ల్ ఫ్రెండ్ తో గ్రాండ్గా నిశ్చితార్థం చేసుకున్నాడు ప్రదీప్ . దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. గుట్టుచప్పుడు కాకుండా తన గర్ల్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రదీప్ .. ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఆ పిక్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు .

కానీ తన ప్రియురాలు పేరు మాత్రం రిలీజ్ చేయలేదు ..ఫోటోలను మాత్రం నెట్టింట పెట్టాడు ..ఇది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. పోనీలే ఫైనల్లీ నువ్వు అనుకున్నది సాధిస్తున్నావ్ ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావ్ అంటూ ఫ్యాన్స్ ఆయనకు కంగ్రాట్యులేషన్స్ అంటూ విషెస్ చెబుతున్నారు . అయితే చాలామంది ప్రదీప్ అంటే టాలీవుడ్ స్టార్ యాంకర్ ప్రదీప్ అనుకొని పొరపాటు పడుతున్నారు. అసలు ప్రదీప్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్నాడు.. అతగాడు పెళ్లి చేసుకుంటాడా..? చేసుకోడా..? అన్నది తెలుగు జనాలకు ఎప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది..!!