పుష్ప2 వాయిదా.. దేవర విషయంలో కొరటాల సంచలన నిర్ణయం..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్ప2 సినిమాకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఎవరు ఊహించిన విధంగా పుష్ప2 సినిమాను వాయిదా వేయడం సంచలనంగా మారింది . సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సినిమాపై అభిమానులు ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అందరికీ తెలిసిందే. మరి అలాంటి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా బ్యాక్ స్టెప్ వేస్తూ డిసెంబర్ 6న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ నిర్ణయం తీసుకోవడం బాగా బాగా సెన్సేషన్ గా మారింది .

కాగా ఇప్పుడు పుష్ప 2 వాయిదా పడడంతో దేవర సినిమా ముందుకు రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమానే ఈ దేవర . ప్రజెంట్ ఈ సినిమా షెడ్యూల్ కోసం థాయిలాండ్ వెళ్ళాడు ఎన్టీఆర్ . అయితే పుష్ప 2 వాయిదా పడడంతో ఆ ప్లేస్లోకి దేవర రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . కానీ ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దేవర రిలీజ్ డేట్ లో ఏం మాత్రం మార్పు తీసుకురావడం లేదట .

అక్టోబర్ 10నే ఈ సినిమా రిలీజ్ చేసేందుకు గట్టిగా ఫిక్స్ అయ్యాడట కొరటాల. కొంతమంది పెద్ద మనుషులు ఫోర్స్ చేస్తున్నా సరే కొరటాల మాత్రం ఆ విషయంలో వెనక్కి తగ్గడం లేదట . అక్టోబర్ 10వ తేదీనే దసరా కానుకగా దేవర సినిమాను థియేటర్స్లోకి తీసుకురాబోతున్నారట. సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ఏంటో ఈ పెద్ద సినిమాల కష్టాలు..ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతుందో..? ఎప్పుడు ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో అర్ధం కానీ పరిస్ధితి నెలకొంది..!!