అమ్మ బాబోయ్.. అలియా భట్ లో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఫ్యాన్స్ ఫిదా..!

అలియా భట్ .. బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ .. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది . కాగా చాలామంది హీరోయిన్స్ లో హిడెన్ టాలెంట్ ఉంటుంది. కొంతమంది వాటిని బయట పెడుతూ ఉంటారు . అయితే ఆలియా భట్ ఇన్నాళ్లకు తనలోని టాలెంట్స్ బయటపెట్టింది . రన్బీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆలియా భట్.. ఒక పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

కాగా ప్రజెంట్ ఒకపక్క సినిమాలతో మరొక పక్క ఫ్యామిలీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్న అలియాభట్ తాజాగా తనలోని ఓ స్పెషల్ టాలెంట్ను బయటపెట్టింది . అలియాబట్ తనలోని రచయితను నిద్రలేపింది . అలియా భట్ తన మొదటి పుస్తకాన్ని ఇటీవల విడుదల చేసింది . Ed finds a home అనే పేరుతో అలియాభట్ తన మొదటి పిల్లల పుస్తకాన్ని రిలీజ్ చేసింది . ఈ పుస్తకంలో ఆలియా దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..” కొత్త ప్రయాణం మొదలు అంటూ చెప్పుకొచ్చింది”.

” నా చిన్నతనం నుంచి చాలా కధలు వింటూ పెరిగాను .. ఒకరోజు నాలోని చిన్న పిల్లని బయటకు తీసుకొచ్చి కథలు రాయాలి అని అనుకున్నాను.. ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది “అంటూ చెప్పుకొచ్చింది . సోషల్ మీడియాలో ప్రెసెంట్ అలియాభట్ షేర్ చేసిన ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి ..బాగా వైరల్ గా కూడా మారాయి . నీలో ఇంత మంచి టాలెంట్ ఉందా..? అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు..!!