ఎప్పుడు కూల్ గా ఉండే ప్రభాస్ కు కూడా విపరీతమైన కోపం తెప్పించే ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా..?!

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ గురించి ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా ఆయన చాలా మంచి వ్యక్తి.. పిస‌రంత కూడా గర్వం ఉండదు.. అందరికీ ఆప్యాయంగా భోజనాలు పెడుతూ ఉంటారంటూ చెప్తూ ఉంటారు. అతనితో పని చేసిన ఇండస్ట్రీ సెలబ్రిటీస్ అంతా ప్ర‌భాస్‌ను తెగ పొగిడేస్తూ ఉంటారు. ఒకసారి ఆయనతో పరిచయం ఏర్పడిందంటే ఆయన వ్యక్తిత్వానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అన్న టాక్ కూడా ఉంది. చిన్న న‌టులు, పెద్ద సెలబ్రిటీ అని స్టేటస్‌ను బ‌ట్టి కాకుండా అందరినీ గౌరవిస్తాడని.. అందరితో ఆప్యాయంగా ఉంటాడని చెబుతూ ఉంటారు. ఇలాంటి క్రమంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తి అంటే ప్రభాస్‌కు చాలా కోపం అని నెటింట‌ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన మరెవరో కాదు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్ కుమార్. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి అన్ని సినిమాలకు.. ఈయన సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తారు.

Meet Senthil Kumar, the Man Who Shot the 'Baahubali' Films

ఇక ఈ సినిమా ఆటోగ్రాఫర్ ప్రభాస్ హీరోగా చేసిన ఛ‌త్రపతి, బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూషన్ లాంటి ఎన్నో ప్రముఖ సినిమాలకు పనిచేశాడు. అయితే ఈ సినిమాల షూటింగ్ టైంలో సెంథిల్ తీరు ప్రభాస్ కి అసలు నచ్చలేదట.. దానికి కార‌ణం రాజమౌళి కంటే సెంథిల్ మరింత పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాడని.. ఫేమ్‌లో.. పొజిషన్, మూవ్మెంట్, బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్పెషన్స్ అన్ని కరెక్ట్ గా ఉండాలని అందరికీ సజెస్ట్ చేస్తూ ఉంటాడని.. అయితే ప్రభాస్ సరిగా కెమెరా ముందు లేనప్పుడు చాలా సలహాలు చెబుతాడని.. షార్ట్ ఓకే అయ్యేంతవరకు పదేపదే ఇబ్బంది పెడతాడని.. దానివల్ల ప్రభాస్ ఇంకా ఎంతసేపయ్యా బాబు అంటూ సెంథిల్ పై తరచు కోపం తెచ్చుకునే వాడని టాక్‌.

Prabhas upcoming films: From Kalki 2898 AD to Hanu Raghavapudi directorial

అయినా సెంథిల్ మాత్రం సీన్ పర్ఫెక్ట్ గా వస్తేనే ప్రభాస్‌ను వదిలిపెట్టే వాడట. అలా రాజమౌళి కంటే మరింత పర్ఫాక్షనిస్ట్ గా వ్యవహరిస్తూ ప్రభాస్ కు కోపం తెప్పించే వాడట. ఇక మొదట ఇండ‌స్ట్రీకి సెంథిల్ టీవీ సిరీస్ అమృతంతో సినిమాటోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత మెల్ల మెల్లగా సినిమాలకు పని చేయడం మొదలుపెట్టాడు. ఇక చివరిగా సెందిల్ రాజమౌళి ఆర్‌ఆర్ఆర్ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు. ఈ మూవీ గ్లోబల్ లెవెల్ లో ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ప్రస్తుతం కల్కి 2898 ఏడి, కన్నప్ప, రాజా సాబ్, సలార్ 2 శౌర్యాంగ పర్వం, స్పిరిట్‌ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నాయి.