సినిమా ఫ్లాప్ అయితే పార్టీ చేసుకుంటా.. చరణ్ షాకింగ్ కామెంట్స్..?!

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కెరీర్ అద్భుతంగా ప్లాన్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గేమ్‌ చేంజర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్.. బుచ్చిబాబు సన్ డైరెక్షన్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే తాజాగా చరణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా ప్లాప్ అయితే పార్టీ చేసుకుంటాను అంటూ చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారాయి. క్లింకారాతో ఎక్కువ టైం గడపడానికి ప్రాధాన్యత ఇస్తున్నాను అంటూ చెప్పిన చరణ్.. ఒత్తిడిని ఎలా తీసుకోవాలో నాకు తెలియదంటూ చెప్పుకొచ్చాడు.

Ram Charan, Shankar's 'Game Changer' shoot cancelled at the last minute.  Here's why - India Today

సినిమా ఫ్లాప్ అయితే ఆ టైంలో రిలాక్స్మెంట్ కోసం కచ్చితంగా పార్టీ చేసుకుంటానని ఆయన వివరించాడు. ఆర్‌ఆర్ఆర్ హిట్ అయిన తర్వాత వారం రోజులు బయటకు రాలేదంటూ వివ‌రించిన ఆయ‌న‌ ఫ్యామిలీతో ఆ వీక్ ఎంజాయ్ చేశానని వివ‌రించాడు. ఇక‌ నేను వారసత్వం గురించి ఎక్కువగా ఆలోచించనంటూ చెప్పుకొచ్చాడు.

Ram Charan electrifies Leadership Summit | cinejosh.com

ప్రస్తుతం ఏం జరుగుతుందనే దానిపై మాత్రమే దృష్టి పెడతానని.. తండ్రిగా, కుమారుడిగా, సోదరుడిగా ఈరోజు నా బాధ్యతలు పూర్తయ్యాయ లేదా.. న్యాయం చేశానా.. అని మాత్రమే చూస్తానని అదే నాకు ముఖ్యం ప్రతిరోజు నేను ఇదే ఆలోచిస్తానని వివ‌రించాడు. ఇక ప్రస్తుతం చరణ్‌ నటిస్తున్న గేమ్ చేంజర్ షూట్‌ మరో వారం రోజుల్లో పూర్తికానుంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ మేకర్స్ అనౌన్స్ చేస్తారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.