నయా రికార్డ్ సృష్టించిన ‘ కల్కి 2898 ఏడి ‘ భైరవ్ ఎంతమ్.. ఎన్ని వ్యూస్ దక్కించుకుందంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సినిమాలు గా తెర‌కెక్కుతున్న వాటిలో ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898ఏడీ కూడా ఒకటి. ఇటీవల ఈ సినిమా నుంచి భైరవ ఏంత‌మ్‌ సాంగ్ రిలీజ్ ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకుంది. తాజాగా ఈ సాంగ్ youtube లో ఫైవ్ మిలియన్ న్యూస్ ను దక్కించుకొని ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మేకర్స్‌ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు.

Kalki 2898 AD First Single Bhairava Anthem Release Postponed: Here's When  It Will Drop Now, Untill Then Enjoy Audio Version

ఈ ఫ్యూచర్ స్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో కమలహాసన్, దిశాపఠాని, అమితాబచ్చన్, మృణాల్ ఠాగూర్, విజయ్ దేవరకొండ లాంటి ఎంతోమంది స్టార్ నటులు కీలక పాత్రలు నటిస్తున్నారు. జూన్ 27, 2024న గ్రాండ్ లెవెల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ఈ హై బడ్జెట్ సినిమాకు సంతోష్ నారాయణ్‌ సంగీతం అందించాడు. అయితే సినిమా సెట్స్‌ పైకి వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఎదురుచూస్తున్న మేకర్స్.. అంచనాలను నాగ్‌ అశ్విన్ అందుకుంటాడో.. లేదో.. ప్రభాస్‌కు ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ వస్తుందో వేచి చూడాలి.