టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. బాలకృష్ణ, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ నటించిన ‘ ఉస్తాద్ భగత్ సింగ్ ‘ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. ఇక ప్రస్తుత ఈ అమ్మడికి తమిళ్లో ఆఫర్స్ వస్తున్నాయని.. కానీ దేనీ ఫైనల్ చేయలేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు ఇవన్నీ కాదన్నట్లు బాలీవుడ్ లో ఎంట్రీ సిద్ధమైందని టాక్ నడుస్తుంది. అమెరికాలో పుట్టి పెరిగిన శ్రీలీల.. తెలుగు, కన్నడ మూలాలున్న అమ్మాయి. దీంతో టీనేజ్ లోనే కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. పెళ్లి సందడి మూవీ తో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమా సక్సెస్ కాకపోయినా తరువాత రవితేజతో నటించిన ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని వరుస అవకాశాలను చేజ క్కించుకుంది.
రీసెంట్గా తమిళ్ స్టార్ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీ లీల.. ఇప్పుడు బాలీవుడ్ పై కన్నేసిందని.. ఓ స్టార్ హీరో కొడుకు సినిమాలో హీరోయిన్గా నటిస్తుందని తెలుస్తుంది. ఇంతకీ ఆ స్టార్ హీరో కొడుకు ఎవరో.. ఒకసారి చూద్దాం. ఆదిపూరుష్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీంఖాన్ ప్రస్తుతం దిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో శ్రీ లీలా హీరోయిన్గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమై.. ఈ సినిమాతో హిట్ కొడితే శ్రీ లీల బాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకోవడం ఖాయం.