అబ్బబ్బా.. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ..తెలుగు సినిమాకి సైన్ చేసిన నిత్యామీనన్ హీరో ఎవరంటే..?

నిత్యామీనన్.. పేరుకి మలయాళ బ్యూటీనే.. తెలుగులో పాపులారిటీ ఎలా సంపాదించుకుందో మనం చూసాం.. నాచురల్ స్టార్ హీరో నాని నటించిన అలా మొదలైంది సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ..హైట్ తక్కువే కానీ నటనలో మాత్రం గుడ్ పెర్ఫార్మెన్స్ .. ఎటువంటి క్యారెక్టర్ లోనైనా అవలీలగా నటిస్తుంది ..పాటలు కూడా చక్కగా పాడుతుంది.. ఎక్స్ప్రెషన్ క్వీన్ అనే చెప్పాలి …

చాలా చాలా జోవియల్ గా అందరితో సరదాగా మూవ్ అవుతుంది.. ఈ మధ్యకాలంలో నిత్యామీనన్ తెలుగు సినిమాలకు సైన్ చేయలేదు ..ఆఫ్టర్ ఏ లాంగ్ టైం తెలుగు హీరో సినిమాలో కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న సినిమా తమ్ముడు . ఈ సినిమాలో లయ కీలక పాత్రలో కనిపించబోతుంది . కాగా ఈ సినిమాలో నిత్యామీనన్ కూడా ఓ ఇంపార్టెంట్ గెస్ట్ రోల్ లో నటించబోతుందట .

దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . గతంలో నితిన్ నిత్యామీనన్ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇష్క్ – గుండెజారి గల్లంతయ్యిందే లాంటి సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాంబోలో వచ్చాయి . మరోసారి ఈ కాంబో రిపీట్ అవ్వతూ ఉండడంతో ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..???