వామ్మో..సడెన్ గా పేరు మార్చుకోబోతున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. కారణం అదేనా..?

సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ లాస్ట్ గా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మాణంలో ఫ్యామిలీ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరమ చెత్త టాక్ అందుకునింది . రీజన్ ఏంటో తెలియదు కానీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి కూడా ఈ సినిమా నచ్చలేదు .

బహుశా ఆయనను ఇలాంటి రోల్ లో చూడాలి అని ఫాన్స్ భావించకపోవడం కారణమై ఉండొచ్చు అంటూ అప్పట్లో కామెంట్స్ వినిపించాయి. ఆ తర్వాత తన సినిమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు విజయ్ దేవరకొండ . తాజాగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . విజయ్ దేవరకొండ తన పేరు మార్చుకోబోతున్నారట . యస్ ఈ న్యూస్ ఇప్పుడూ ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది.

జాతకంలో ఉన్న కొన్ని దోషాల కారణంగా ఆయన పేరులో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోబోతున్నారట. తద్వారా ఆయన జాతకం మారుతుంది అని ఆ తర్వాత హిట్స్ పడుతాయి అని భావిస్తున్నారట . నిజానికి విజయ్ ఇలాంటి నమ్మడు..కానీ విజయ్ దేవరకొండ తల్లి సలహా మేరకే ఈ విధంగా పాటించబోతున్నాడట. తల్లి కోసం నమ్మకం లేని పని కూడా చేయబోతున్నాడు విజయ్.. ప్రజెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!