ఇష్టం లేకపోయినా సరే తారక్ చేత అలాంటి పని చేయిస్తున్న కొరటాల శివ.. హిట్ కోసం ఎన్ని తిప్పలో..?

మనకు తెలిసిందే ఎన్టీఆర్కి ఇష్టం లేకుండా ఏ పని చేయడు.. ఆయన నమ్మిన సిద్ధాంతాలను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు . అయితే ఫస్ట్ టైం ఎన్టీఆర్ తనకు ఇష్టం లేకపోయినా సరే కొరటాల శివ చెప్పాడు అన్న కారణంతో ఓ పని చేయబోతున్నాడట ..అది కూడా లక్ష్మీ ప్రణతి పర్మిషన్ తీసుకొని మరి చేయబోతున్నాడట . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సినీ వర్గాలలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర .

ఈ సినిమా రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది . ఈ సినిమాలో చాలా చాలా ట్వీస్ట్ లు ఉండబోతున్నాయి అంటూ ప్రచారం కూడా జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు వచ్చే బోట్ ఫైట్ సీన్స్ సినిమాకి హైలైట్ గా మారబోతుందట. దాదాపు పదివేల మందితో ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తారట . కాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న జాన్వి కపూర్ తో ఒక రొమాంటిక్ సాంగ్ ని కూడా ప్లాన్ చేశాడట కొరటాల శివ .

నిజానికి పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ రొమాంటిక్ సీన్స్ లో సాంగ్స్ లో నటించడం మానేశాడు. అయితే చాలాకాలం తర్వాత మళ్లీ కొరటాల శివ బలవంతం చేయబోడంతో ఆయన ఈ సినిమాలో జాన్వి కపూర్ తో రొమాంటిక్ సాంగ్ లో నటించడానికి ఓకే చేశారట . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు తెలుగు సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. చూద్దాం మరి జాన్వి కపూర్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఎంత హైలెట్ గా ఉండబోతుందో..?? అక్టోబర్ 10వ తేదీ దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది..!!