ఇప్పుడు సోషల్ మీడియాలో .. సినిమా ఇండస్ట్రీలో .. ఏపీ రాజకీయాలలో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం . పవన్ కళ్యాణ్ కు స్పెషల్గా విషెస్ కూడా అందిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ ఓట్ల మెజారిటీతో గెలవడంతో పవన్ కళ్యాణ్ ను ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ప్రశంసిస్తున్నారు . .21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని 100 శాతం స్ట్రైక్ రేట్ తో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి భారీ మెజారితో గెలుపొందారు
మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందింది అంటూ ప్రశంసిస్తున్నారు. ఇదే క్రమంలో పలు పక్క భాష సినీ ఇండస్ట్రీ నటులు కూడా పవన్ కళ్యాణ్ ను ప్రశంసిస్తూ ట్వీట్స్ చేస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోని అందరికన్నా చాలా డిఫరెంట్గా వెరైటీగా విషెస్ అందించాడు విజయ్ దళపతి. దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . విజయ్ దళపతి కూడా రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన ఒక హీరో అలాంటి పని చేసిన మరొక హీరోని పొగిడేయడం.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది..!!
“ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు చాలా చాలా అభినందనలు. ఏపీ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించినందుకు ఆనందంగా ఉంది. ప్రజల కోసం మీరు కట్టుబడిన తీరు, మీ పట్టుదల అందరికి స్ఫూర్తి దాయకం. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను” అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు విజయ్. దీంతో పవన్ ఫ్యాన్స్ బాగా ట్రెండ్ చేస్తున్నారు..!!
Congratulations to Shri @ncbn garu and @JaiTDP for the decisive victory in the assembly elections to lead #AndhraPradesh
Wishing the people of AP great progress under your visionary leadership.
Vijay,
President,
Tamilaga Vettri Kazhagam— TVK Vijay (@tvkvijayhq) June 4, 2024