తొలి ఇండియన్ యాక్ట్రెస్ గా అలాంటి రేర్ ఫీట్ సాధించిన బాలయ్య బ్యూటీ.. మ్యాటర్ ఏంటంటే..?!

యాక్ట్రెస్ చంద్రిక రవికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు సినిమాతో తమిళ్ ఆడియన్స్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే టాలీవుడ్ లోను బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను మెస్మ‌రైజ్ చేసింది. ఇప్పుడు తన సినీ కెరీర్‌లో మరో మెట్టు ఎదుగుతుంది ఈ అమ్మడు. భారతీయ సంతతికి చెందిన భారతీయ మూలాలు ఉన్న ఈ అమ్మడు ఆస్ట్రేలియాలో తన లైఫ్ గడిపింది నటి చంద్రిక రవి. షో అనే అమెరికన్ రేడియో టాక్ షోను హోస్ట్ చేయడానికి తాజాగా సిద్ధమైంది.

Chandrika Ravi • ॐ (@chandrikaravi) • Instagram photos and videos

ఆమె తన గుర్తింపు కోసం ఎలా పోరాడుతుందో తెలుసుకొని అవిన్యూ రేడియో వ్యవస్థాపకుడు సామీ చంద్ ఆమెకు ఒక జాక్పాట్ ఆఫర్ అందించారట‌. తన జీవితా అనుభవాలను ప్రపంచంతో పంచుకునేలా రేడియో ఒక గొప్ప వేదిక కాబట్టి.. తనకు ఆ అవకాశాన్ని ఇచ్చినట్లు ఆమె తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. రేడియో టాక్ షోకు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న చంద్రిక ఈవెంట్ యూఎస్‌లోని అతిపెద్ద నెట్వర్క్ ల‌లో ఒకటైన ఐ హర్ట్ రేడియోలో రిలీజ్ కానుందని వివరించింది. ఇది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. కొంచెం ఒత్తిడి, కొంచెం ప్రాఫిట్, కెమెరా వెనుక ఉండడం తర్వాత.. ఇది నాకు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంటూ చెప్పుకొచ్చింది.

Watch: Special dance number from Nandamuri Balakrishna's 'Veera Simha Reddy'  is out | Telugu Movie News - Times of India

ప్రజలు నిజమైన నన్ను ఇప్పుడు వింటారు అంటూ వివరించింది. సినీ కెరీర్ కంటే ముందు చంద్రక రేడియోలో మరియు టెలివిజ‌న్‌ల‌లో పలు లైవ్ షోలను హోస్ట్‌గా వ్యవహరించింది. అయితే యూఎస్ లో రేడియో షోను హోస్ట్ చేసిన మొదటి భారతీయ న‌టిగా ఆమె తాజా రికార్డ్ సృష్టించనుంది. నేను మొదటి వ్య‌క్తిని కావచ్చు కానీ నేను చివరి వ్య‌క్తిని కాదు అంటూ ఆమె షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. చంద్రిక షో యూఎస్ లోని అతిపెద్ద నెట్వర్క్‌లో ఒకటైన ఐ హీట్ రేడియో మరియు రుకాస్ అవెన్యూ రేడియోలో ప్రతి గురువారం భారత్ టైం ప్రకారం ఏడున్నర గంటలకు ప్రసారం కానుంది. పూర్తి ఎపిసోడ్ ప్రతి శుక్రవారం యూట్యూబ్ లో అంతర్జాతీయంగా అందరి కోసం రిలీజ్ చేయనున్నట్లు ఆమె వివరించింది.