ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయ భేరీ మోగించిన సంగతి తెలిసిందే. ఆయన పోటీపడిన 21 ఎమ్మెల్యేలు, ఎంపీ సీట్లను ఆయన 100% గెలుచుకొని భారీ సక్సెస్ సాధించాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ తో పాటు.. పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఇక మెగా ఫ్యామిలీ ఆనందానికి హద్దులు లేవు అనడంలో అతిశయోక్తి లేదు.
కొంతమంది ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తుండగా.. మరి కొంతమంది సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. తండ్రి సక్సెస్ ను హ్యాపీగా ఫీల్ అవుతూ.. సెల్యూట్ కెప్టెన్ అంటూ పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇస్తున్న ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం అఖీరా చేసిన ఈ పోస్ట్‌ను పవన్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.
ఈ పోస్ట్ కు భారీ ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గ్రేట్ లీడర్ అంటూ.. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆఖీరా చేసిన ఈ పోస్ట్ ను తల్లి రేణు దేశాయ్ రి పోస్ట్ చేయడం.. మరింత ఆసక్తిగా మారింది. ఆఖీర షేర్ చేసిన పోస్ట్‌ను స్క్రీన్ షాట్ తీసి ఆఖీర తన నాన్న గురించి చేసిన పోస్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో రేణు దేశాయ్ చేసిన పోస్ట్ కూడా సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతుంది.