కల్కి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ముహూర్తం ఎప్పుడంటే..?!

పాన్ ఇండియ‌న్‌ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుత నటిస్తున్న సినిమాల్లో కల్కి 2898 కోసం ప్రేక్షకులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ కు వస్తుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. కల్కి 2898 ఏడి ట్రైలర్ త్వరలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావలసి ఉండగా ఏవో కారణాలతో ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే.

Prabhas Kalki 2898 AD trailer to release on June 10 New poster out - India Today

అయినా ఈ సినిమాకు మహానటి ఫ్రేమ్ నాగ్ అశ్విన్‌ దర్శకత్వం వహించడం.. అలాగే ప్రభాస్ హీరో కావడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఓపికగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కల్కి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని తెలియడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 27న ఈ కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ జూన్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది.

Prabhas Kalki 2898 AD trailer to release on June 10 New poster out - India Today

ఇక ఇటీవల ప్రభాస్ సినిమా ప్రమోషన్స్‌ని కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కల్కి వర‌ల్డ్‌లోకి ఎంటర్ అయ్యే ముందు ఆడియన్స్ డౌట్ ను క్లియర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ సమాధానం చెపుతున్నారు మూవీ టీం. కల్కి వరల్డ్ ఎలా ఉండబోతుంది చూసేటప్పుడు ప్రేక్షకులకు ఎలాంటి సందేహాలు రాకుండా ఉండాలని ఇటీవల బుజ్జి అండ్ భైరవ పేరుతో యానిమేటెడ్ సిరీస్ కూడా రిలీజ్ చేశారు. ఈ సిరీస్ విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో కల్కి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఇక ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.