ఆ హీరోయిన్ బయోపిక్ లో అనుపమ పరమేశ్వరన్ ..లక్కీ ఛాన్స్ కొట్టేసిందిరోయ్..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ ఎక్కువగా ఫిమేల్ ఓరియంటెడ్ పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్టార్ హీరో సినిమాలో నటించిన ఆ క్రేజ్ మొత్తం వాళ్లే ఎత్తుకెళ్లి పోతున్నారు అని హీరోయిన్స్ కి సక్సెస్ అందడం లేదు అని చాలామంది హీరోయిన్స్ కంప్లైంట్ చేస్తున్నారు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరణ్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అనుపమ పరమేశ్వరణ్ మలయాళీ బ్యూటీనే.. తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకుంది .

హ్యూజ్ క్రేజ్ కూడా దక్కించుకునింది . కాగా ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ హీరోయిన్ గా కూడా మారిపోయింది . టిల్లు స్క్వేర్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఎంత అందాలను విచ్చలవిడగా ఆరబోసిందో మనకు తెలిసిందే . రీసెంట్గా అనుపమ పరమేశ్వరణ్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్ బయోపిక్ లో నటించబోతుందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు ప్రత్యూష .

ఇండస్ట్రీలో చిన్న ఏజ్ లోనే స్టార్ హీరోయిన్గా మారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన ప్రత్యూష బయోపిక్ తెరకెక్కబోతుంది అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది . దీనికోసం చాలామంది హీరోయిన్స్ కూడా అప్రోచ్ అవుతూ వచ్చారట. కానీ కాంట్రవర్షియల్ కంటెంట్ కావడంతో ఆమె మరణానికి సంబంధించి పలువురు పొలిటీషియన్స్ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉండడంతో ఈ రోల్ లో ఏ హీరోయిన్ కూడా నటించడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదట . ఫైనల్లీ అనుపమ పరమేశ్వరణ్ అందుకు ఓకే చేసినట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!