స్టార్ హీరోకి బ్రదర్ గా గోపీచంద్ ..ఫైనల్లీ సక్సెస్ కోసం దిగివచాడుగా..!

మనం ఎన్నెన్నో అనుకుంటాం.. కానీ అన్ని జరగాలి అన్న రూల్ లేదు ..అన్ని జరుగుతుంది అన్న ఆశలు కూడా లేవు .. టైం ఎప్పుడు ఎవరికి ఎలా మారిపోతుందో ఎవ్వరు చెప్పలేం . కాగా ప్రజెంట్ అదే సిచువేషన్ ఫేస్ చేస్తున్నాడు హీరో గోపీచంద్ అన్న వార్త ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. గోపీచంద్ ఇండస్ట్రీలో మ్యాంచో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . తనదైన స్టైల్ లో సినిమాల్లో నటించి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా దక్కించుకున్నాడు .

కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో గోపీచంద్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . గోపీచంద్ ఒక స్టార్ హీరో కి బ్రదర్ గా కనిపించబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు రామ్ పోతినేని తో కలిసి ఒక సినిమాను తరికెక్కించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ సినిమాలో రామ్ పోతినేని బ్రదర్ లుక్ లో కనిపించబోతున్నాడట గోపిచంద్ .

నిజానికి చాలా సినిమాలలో ఇలాంటి ఆఫర్లు వచ్చిన రిజెక్ట్ చేశాడు గోపీచంద్. కానీ ఈ పాత్ర మాత్రం చాలా వైవిద్య భరితంగా ఉంటుందట . ఆ కారణంగానే రామ్ పోతినేనికు బ్రదర్ గా నటించడానికి ఓకే చేశాడట. గోపీచంద్ ఫైనల్లీ సక్సెస్ కొట్టడానికి ఒక మెట్టు దిగాడు గోపీచంద్ అంటూ బాగానే జనాలు ట్రోల్ చేస్తున్నారు. చూద్దాం మరి ఈ సినిమా గోపీచంద్ కి ఎలాంటి హిట్ అందిస్తుందో..??