పుష్ప2కి కొత్త సమస్యలు వచ్చాయా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో లెక్కలు మాస్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ …ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరక్కించిన సినిమా పుష్ప2 ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు సుకుమార్ .
కాగా రీసెంట్గా సుకుమార్ కు కొత్త తలనొప్పులు క్రియేట్ అవుతున్నాయి అన్న వార్త బాగా వైరల్ గా మారింది . ఈ సినిమాకు రెమ్యూనరేషన్లు పెరగడంతో బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయిందట . దాంతో నిర్మాతలు తెలుగు థియేటర్ రైట్ కు భారీ రేట్స్ చెప్పడం అందరికీ షాక్ ఇచ్చింది. అయితే డిస్టర్బ్యూటర్స్ ఆ స్థాయి రేట్లు అందుకోలేమంటూ చేతులెత్తేస్తున్నారు. రైట్స్ ని భారీ మొత్తం ఇచ్చి తీసుకోవడం చాలా కష్టం అంటున్నారు.
అడ్వాన్స్ ఇచ్చే సినిమా తీసుకుంటామంటూ చెబుతున్నారట . ఫస్ట్ పార్ట్ లో తాము భారీ అమౌంట్ తీసుకొని నష్టపోయాము అని సినిమా హిట్ అయిన కొన్ని ఏరియాలో లాభాలు కనపడలేదు అని చెబుతున్నారట . అంతేకాదు పుష్ప 2 విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారట డిస్టర్బ్యూటర్స్ . మరి ముఖ్యంగా ఆంధ్రాలో థియేటర్ల రేట్లు స్పెషల్ షోలు పర్మిషన్లు సమస్యలు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం అంటూ తెలుస్తుంది . మరి సుకుమార్ ఈ ప్రాబ్లమ్స్ ని ఎలా సార్ట్అవుట్ చేసుకుంటారో చూడాలి..??