ఓరి దేవుడోయ్..షారుఖ్ ఖాన్ పెట్టుకున్న ఈ వాచ్ అంత కాస్ట్లీనా..? ఏకంగా పాన్ ఇండియా మూవీ తీసేయ్యచ్చుగా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ పెట్టుకునే వాచెస్ ..వాడే యాక్ససరీస్ వేసుకునే బట్టలకి సంబంధించిన బ్రాండెడ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. సెలబ్రిటీలు మామూలుగా చిన్న చిన్న బ్రాండ్స్ వాడరు అన్న విషయం తెలిసిందే. వాళ్ళు ఏది వాడిన హై రేంజ్.. హై క్వాలిటీ ..హై క్స్స్ట్ ఉంటాయి. దాదాపు స్టార్ హీరోలు అందరిదీ ఒకే తంతు ఎవరో ఇద్దరో ముగ్గురో హీరోలు చాలా తక్కువ చీప్ బ్రాండ్స్ వాడుతూ ఉంటారు.

అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ షారుఖ్ ఖాన్ పెట్టుకున్న వాచ్ సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . మనకు తెలిసిందే షారుక్ ఖాన్ కి వాచెస్ అంటే పిచ్చి.. ప్రత్యేకమైన క్రేజ్ కోట్లు కోట్లు ఖర్చు చేసి వాచెస్ కొంటూ ఉంటారు . ఇటీవల జరిగిన ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్లో షారుక్ ఖాన్ పెట్టుకున్న వాచ్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ వాచ్ రిచర్డ్ మిలే కంపెనీకి చెందిన వాచ్ గా తెలుస్తుంది .

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ వాచ్ ధర అక్షరాల 11కోట్ల రూపాయలు అంటూ తెలుస్తుంది . ఈ వాచ్ ధరతో ఓ భారీ బడ్జెట్ సినిమా తీయొచ్చు అంటూ జనాలు కామెంట్స్ పెడుతున్నారు . సాధారణంగా సెలబ్రిటీస్ ఎవ్వరూ ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి వాచ్ కొన్నారు . అయితే షారుక్ ఖాన్ కి నచ్చితే ఎన్ని కోట్లు అయినా సరే ఖర్చుపెట్టి .. వాచెస్ కొంటాడు అన్న విషయం అందరికీ తెలిసిందే .. ఆ కారణంగానే ఎంతో స్పెషల్ ఫీచర్స్ కలిగిన ఈ వాచ్ ను షారుక్ ఖాన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది . ప్రజెంట్ న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది..!!