హార్దిక్-నటషా విడాకుల్లో మైండ్ బ్లోయింగ్ ట్వీస్ట్..ఫ్యాన్స్ షాక్..!

ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకుంటున్న స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువగా చూస్తున్నాం. మరీ ముఖ్యంగా కొంతమంది చాలా చిన్న ఏజ్ లోనే విడాకులు తీసుకొని వైవాహిక జీవితాన్ని సగంలోనే తుంచేసుకుంటున్నారు . అయితే కొంతమంది విడాకులు తీసుకోకపోయిన సరే విడాకులు తీసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఈ వార్తలు పై ఎప్పటికప్పుడు ఆ స్టార్ సెలబ్రిటీస్ స్పందిస్తున్న సరే అలాంటి వార్తలకు మాత్రం బ్రేక్ పడడం లేదు. స్టార్ సెలబ్రిటీస్ కావడంతో ప్రతిసారి అలాంటి వార్తలపై రిప్లై ఇవ్వలేకపోతున్నారు కొందరు స్టార్స్ .

తాజాగా సోషల్ మీడియాలో మరొక స్టార్ సెలబ్రిటీ విడాకులు తీసుకోబోతున్నారు అన్న ప్రచారం బాగా ఊపందుకుంది . ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాడ్యా ఆయన భార్య నటాష విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఒక్కసారిగా వార్తలు రావడంతో ఫ్యాన్స్ షాక్ అయిపోయారు . గత 48 గంటల నుంచి సోషల్ మీడియాలో ఈ వార్త ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతూ వచ్చింది . దానికి మెయిన్ రీజన్ ఆమె ఈ మధ్యకాలంలో మాజీ ప్రియుడు అలెగ్జాండర్ తో కనిపించడమే . దీంతో వీరి విడాకులు 70% కన్ఫామ్ అంటూ ఫిక్స్ అయిపోయారు జనాలు.

అయితే ఇదంతా ఓ ఫేక్ వార్త అంటూ క్లారిటీకి వచ్చేసింది . హార్దిక్ పాండ్యా నటాషా విడాకులు తీసుకోబోతున్నారు అన్న వార్తలో ఎటువంటి నిజం లేదు అన్న విషయం క్లారిటీకి వచ్చింది . ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా ఆటగాడిగా ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు దారుణంగా ఓడిపోయాడు. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రోలింగ్ జరిగింది . ఆ ట్రోలింగ్ నుంచి తప్పించుకోవడానికి హార్దిక్ పాండ్యా అందరి దృష్టిని ఇలా మళ్ళించేందుకు నటాషా తో విడాకులు అంటూ రూమర్ క్రియేట్ చేశారట . అభిమానుల కోపాన్ని తగ్గించేందుకు ఈ న్యూస్ క్రియేట్ చేసినట్లు వార్త ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది. జనాలను వెర్రి వాళ్లను చేస్తున్నారు హార్థిక్ పాండ్యా అంటూ మండిపడుతున్నారు అభిమానులు..!!