“లవ్ మీ” మూవీ రివ్యూ: సినిమా చూసిన ప్రతి ఒక్కరి నోట అదే మాట.. వైష్ణవి మళ్ళీ ఏడ్ఛేస్తుందా..?

“లవ్ మీ”.. దిల్ రాజు వారసుడు ఆశిష్ హీరోగా అందాల ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన సినిమా ..పూర్తి హారర్ కామెడీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది . అయితే ఈ సినిమా అభిమానులను ఆకట్టుకునిందా..? లేదా..? అనే విషయాలు ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

కథ విషయానికి వస్తే.. కథలో కొత్తగా మ్యాటర్ ఏమీ లేదు .. ఇలాంటి హారర్ కామెడీ జోనర్స్ మనం ఇదివరకు చాలా సినిమాలనే చూశాము.. కానీ డైరెక్టర్ కథలో కొన్ని కొన్ని మసాలా ట్వీస్ట్ లు పెట్టడానికి బాగా ట్రై చేశాడు . కానీ ఆ మసాలా ట్విస్ట్ ను జనాలకు అర్థం చేసే విధానం లో డైరెక్టర్ ఫ్లాప్ అయ్యాడు అనే చెప్పాలి . థియేటర్లో ఆ సీన్ వస్తూ ఉంటే బ్యాక్ గ్రౌండ్ లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే సీన్స్ ను జనాలు ముందుగానే కనిపెట్టేస్తున్నారు . దీంతో డైరెక్టర్ రాసుకున్న స్టోరీని జనాలను మెస్మరైజ్ చేయలేకపోయాయి . మరీ ముఖ్యంగా హారర్ కామెడీ జోనర్ అంటే ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసిన జనాలకు ఈ సినిమా బొక్క బోర్ల పడేలా చేసింది .

గతంలో తెరకెక్కిన ప్రేమ కథ చిత్రం ఈ సినిమా ఒకే విధంగా ఉండడం అభిమానులకు ఎక్కడో తేడా కొట్టేలా అనిపిస్తుంది. అడపాదడపా సీన్స్ మార్చారే కానీ ఎక్కడా కూడా దెయ్యాన్ని భయపడే దయంగా చూపించలేదు ..అది ఈ సినిమాకి నెగిటివ్గా మారింది అంటున్నారు జనాలు . దిల్ రాజు వారసుడు అనగానే నటన పరంగా ఓ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం . ఆశిష్ కూడా బాగానే కష్టపడ్డాడు కానీ కథ ఫ్లాప్ అయిన కారణంగా ఆశిష్ నటనకు పెద్దగా మార్కులు పడలేదు .. వైష్ణవి చైతన్య తనదైన స్టైల్ లో పెర్ఫామ్ చేసింది ..కానీ బేబీ సినిమాతో కంపేర్ చేసి చూస్తే ఈ సినిమా తక్కువ నే చెప్పాలి .

మొత్తంగా సోషల్ మీడియాలో నెగటివ్ టాక్ క్రియేట్ చేసుకుని బేబీ సినిమా తో వచ్చిన హైప్ ను ..లవ్ మీ సినిమాతో పోగొట్టుకుంది వైష్ణవి చైతన్య .. స్టేజ్ ఎక్కితే మాటకు ముందు ఏడ్చేసే వైష్ణవి ఈ సినిమా రిజల్ట్ కూడా చూసి ఏడ్చేస్తుందా..? అంటూ జనాలు ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు . చూద్దాం మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..??