ఆ డైరెక్టర్ కి భయపడి ఎన్టీఆర్ ఏం చేశాడో తెలుసా..? అస్సలు నమ్మలేరు..!!

చాలామంది అనుకుంటూ ఉంటారు ఎన్టీఆర్ కి ఏ డైరెక్టర్ అన్న అసలు భయం ఉండదు అని.. డైరెక్టర్లే ఎన్టీఆర్ ను చూసి భయపడుతూ ఉంటారు అని .. ఆయన రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన స్టేటస్ స్టామినా అలాంటిది అని.. కానీ అది తప్పు జూనియర్ ఎన్టీఆర్ చాలా చాలా మంచి వ్యక్తి .. ఎంత పెద్ద స్టార్ అయినా సరే తన తో వర్క్ చేసే వాళ్లకు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు .. ఆ విషయం తారక్ తో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు చెప్పారు .

రీసెంట్గా తారక్ కి సంబంధించిన ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . తారక్ తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు. కానీ నందమూరి అభిమానులు మోస్ట్ ఫేవరెట్ సినిమా ఏది అంటే మాత్రం టెంపర్ అని చెప్పక తప్పదు . ఈ సినిమాలో మనం ఓ కొత్త రకం ఎన్టీఆర్ ని చూస్తాం. చాలా దయాలేని ఓ క్రూరమైన మనిషి దగ్గర నుంచి ఎలా మహా నాయకుడిగా మారాడు అనే విషయాన్ని బాగా చూపించారు డైరెక్టర్ . అయితే ఎన్టీఆర్ ఈ కథను విన్నప్పుడు చాలా భయపడ్డాడట. మరి ముఖ్యంగా ‘నా పేరు దయ నాకు లేనిదే అది “..అని చెప్పే డైలాగ్ ఎక్కడ ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తుందో అన్న భయంతో ఈ సినిమాను యాక్సెప్ట్ చేయలేదట .

ఆ తర్వాత డైరెక్టర్ బాగా నచ్చజెప్పి బలవంతం చేసి ఫస్ట్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది .. సెకండ్ హాఫ్ లో నీది హైలెట్ క్యారెక్టర్ అవుతుంది ఖచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమాని లైక్ చేస్తారు ..ఎంకరేజ్ చేస్తారు ..మీ కెరియర్ లో ది బెస్ట్ గా మారబోతుంది అంటూ చెప్పి ఓప్పించాడట పూరి జగన్నాథ్ ..ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా ఈ సినిమా అమ్మాయిలను కూడా బాగా ఆకట్టుకునింది . ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాలలోకి వాళ్ళ అమ్మగారికి ఈ సినిమాని ఇష్టం అన్న విషయం కూడా ఈ మధ్యకాలంలో బాగా వైరల్ గా మారింది..!!