సలార్ మూవీలో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు పృధ్వి రాజ్. వరదరాజ్ మన్నార్‌గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన తెలుగు వాళ్ళతో.. తెలుగువాడిగా కలిసిపోయాడు. ఈ సినిమా తర్వాత అతని అందరూ గుర్తు పడుతున్నారు. ఆయన పాత సినిమాలపై కూడా దృష్టి సారించారు. అంతలా పృథ్వీరాజ్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే పృథ్వీరాజ్ ఇటీవల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్నేహితులు ఉన్నారని.. వారి గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టాడు. తనకు అత్యంత ఆప్తుడు, మంచి మిత్రుడు తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి కేవలం ప్రభాస్ అని చెప్పిన పృథ్వీరాజ్.. ప్రభాస్ కాకుండా మరో మిత్రుడు పేరు చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా అది రానా దగ్గుపాటి అంటూ వివరించాడు.
అది ఎందుకని విషయాన్ని ఆయన చెబుతూ.. రానా ఓ పెద్ద కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చినా సినిమాల గురించి పూర్తిగా తెలుసుకోకుండా వస్తే ఎవరో చేసిన పనికి తనకు అర్థం ఉండదని.. హీరో అవ్వడానికి ముందే రానా ఓ పని చేశాడని.. ఆ సమయంలోనే అతడికి పృథ్వీరాజ్ మంచి స్నేహితుడయ్యాడని వివరించాడు. ఒక తెలుగు మూవీలో హీరోగా కొన్ని నెల క్రితం ఓ సినిమాలో నటించాడట పృధ్విరాజ్. సరిగ్గా అదే టైంలో మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న రఘువరన్ కన్నుమూయడంతో.. ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందని.. అయితే ఆ సినిమా మళ్ళీ మొదలవకుండా ఇప్పటికీ పూర్తి కాలేదని వివరించాడు పృధ్విరాజ్.
ఇక ఆ సినిమాకి కెమెరా ఆపరేటర్ గా రానా వ్యవహరించారని.. రానా తలుచుకుంటే వందల సినిమాలు ఒకేసారి రూపొందించగలడు.. అంతటి బ్యాగ్రౌండ్ ఉన్న వ్యక్తి అయినా కేవలం కెమెరామమెన్ లేదా కెమెరా ఆపరేటర్ గా రావాల్సిన పని ఆయనకు లేదు. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకోవాలని ఉద్దేశంతో తనను తాను మలుచుకునే విధానం నాకు బాగా నచ్చుతుంది. దీంతో ఆయనకు నేను అభిమానిగా మారిపోయా. ఆ తర్వాత అతనితో స్నేహం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది అంటూ వివరించాడు. అంతే కాదు ఎన్నోసార్లు రానాని తన ఇంటి దగ్గర తన కారులో డ్రాప్ చేశానని చెప్పుకొచ్చాడు పృథ్వీరాజ్.