పాపం..ప్రశాంత్ వర్మ కు భారీ బొక్క..ఏ జన్మలో ఏం పాపం చేశాడో..!?

ఈ మధ్యకాలంలో ప్రశాంత్ వర్మ పేరును కావాలనే జనాలు ట్రోలింగ్కి గురి చేస్తున్నారు . రీజన్ ఏంటో తెలియదు కానీ హనుమాన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఆ సినిమాకు కాంపిటీషన్ వచ్చిన మరొక పెద్ద సినిమా డిజాస్టర్ అయిన తర్వాత ..ప్రశాంత్ వర్మను ఏకిపారేస్తున్నారు జనాలు. మరి ముఖ్యంగా కొంతమంది ఆయన తప్పు లేకపోయినా ఆయనను వేలెత్తి చూపిస్తూ ఉండడం ఆయన సినిమాకు నెగిటివ్ పబ్లిసిటీ క్రియేట్ చేయడం హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. కాగా రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ప్రశాంత్ వర్మకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది .

ప్రశాంత్ వర్మ ప్రజెంట్ తన సినిమాటిక్ యూనివర్స్ లో పలు సినిమాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు . ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ తో ఒక సినిమాకి కమిటీ అయ్యాడు . అయితే తాజాగా ఈ సినిమా ఆగిపోయింది అంటూ ప్రచారం జరిగింది . అయితే సినిమా యూనిట్ కి సంబంధించిన ఒకరు ఈ సినిమా ఆగిపోలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు . కానీ ఈ సినిమా కోసం రన్వీర్ సింగ్ లాస్ట్ మూమెంట్లు హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడు అని ..ఆ కారణంగానే ఈ సినిమా నుంచి ఆయనను తప్పించి వేరే హీరోని పెట్టుకోవాలి అన్న కాన్సెప్ట్ తో ప్రశాంత్ వర్మ ఈ సినిమాని హోల్డ్ లో పెట్టాడు అంటూ ప్రచారం జరుగుతుంది .

అయితే ఇప్పటికే రన్వీర్ సింగ్ పై 25 కోట్లు ఖర్చు చేశాడట ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ఆయన్ని సినిమా నుంచి తీసేస్తే ఖచ్చితంగా భారీ బొక్క తప్పదు అంటున్నారు జనాలు . అలా అని హై రెమ్యూనిరేషన్ కూడా ఇవ్వలేరు కదా అన్న వాదన కూడా వినిపిస్తుంది. దీంతో ప్రశాంత్ వర్మ టైం అసలు బాగోలేదు అని జనాలు ట్రోల్ చేస్తున్నారు . మరికొందరు ఏ జన్మలో ఏ పాపం చేశాడో సినిమా హిట్ అయిన ఆ హీట్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు.. ఆ హిట్ ట్రాక్ ని మరో హిట్ కి పునాదిగా మార్చుకోలేకపోతున్నాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు . ప్రజెంట్ ప్రశాంత్ వర్మ కు సంబంధించిన ఇదే వార్త నెట్టింట బాగా బాగా వైరల్ గా మారింది..!!