హేమ అంత ఆస్తి సంపాదించడం వెనుక ఆయన హస్తం ఉందా..? అలాంటి పనులు కూడా చేస్తుందా..?

ఇప్పుడు..సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ..ఒక పాన్ ఇండియా హీరో .. పాన్ ఇండియా హీరోయిన్ ..పాన్ ఇండియా డైరెక్టర్ కి మించిన రేంజ్ లో మారుమ్రోగిపోతుంది హేమ పేరు . ఇండస్ట్రీలో చిన్నా చితకా క్యారెక్టర్లు చేసుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్ నే.. కానీ రీసెంట్గా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఇష్యూ కారణంగా హేమ పేరు మారుమ్రోగిపోతుంది. కొన్ని వేల కోట్లు ఇచ్చినా సరే పబ్లిసిటీ ఆమె పేరు జరుగుతుంది . ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ యమ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతున్నాయి .

అసలు హేమ రేవ్ పార్టీకి వెళ్లిందా..? వెళ్లలేదా..? డ్రగ్స్ తీసుకుందా..? తీసుకోలేదా..? ఇదంతా పుకార్లైన అనే విషయాలు త్వరలోనే బయటపడి ఉన్నాయి. హేమ మాత్రం నేను రేవ్ పార్టీకి వెళ్లలేదు అని డ్రగ్స్ తీసుకోలేదు అని ధీమాగా చెప్పేస్తుంది . ఇలాంటి మూమెంట్లోనే గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వైరల్ గా మారుతున్నాయి . ఆమె తన భర్త గురించి చెబుతూ తన ఆస్తిపాస్తులు గురించి చెబుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది .

“నా భర్త కెమెరా మ్యాన్ .. డబ్బు విషయంలో ఎటువంటి కొదవలేదు .. తల్లిదండ్రుల ఆస్తి కూడా బాగానే వచ్చింది. మా ఊర్లో మాకు చాలా ఆస్తుంది .. ఇండస్ట్రీ ద్వారా వచ్చే డబ్బులు మాత్రమే కాదు.. నేను పలు కిట్టి పార్టీల ద్వారా కూడా డబ్బులు సంపాదించుకుంటాను ..ఆ దేవుడి దయవల్ల ఒకరి మీద డిపెండ్ అయ్యే పరిస్థితి నాకు రాలేదు. కోట్లస్తుందని చెప్పలేను కానీ.. ఉన్న ఆస్తితో మాత్రమే నేను చాలా సంతోషంగా ఉన్నాను హ్యాపీగా జీవిస్తున్నాను ..అది చాలు అంటూ చెప్పుకొచ్చింది”. దీనితో సోషల్ మీడియాలో హేమకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి ..హేమ నిజాయితీపరురాలు అంటూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు .ఆమెకు అసలు అలాంటి పాడు వ్యసనాలు లేవు అని ఎవరో కావాలనే ఆమెను ఇరికించారు అని హేమ ఫ్యాన్స్ చెప్పుకొస్తూ ఉండడం గమనార్హం..!!