ఐదోసారి ఆ స్టార్ హీరోతో నయన్.. భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్.. ఆ హీరో ఎవరంటే..?!

సౌత్ ఇండియాలో ప్రస్తుతం టాప్ హీరోయిన్గా నయనతార దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నాలుగు పదుల వయసులోనూ పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా.. చేతినిండా సినిమాలతో పాన్ ఇండియా స్టార్ బ్యూటీగా దూసుకుపోతుంది. అలాగే మరోవైపు వాణిజ్య ప్రకట‌న‌ల‌తో బిజీబిజీగా గడుపుతూ వ్యాపార రంగాల్లోనూ రాణిస్తుంది. ప్రస్తుతం నయన్ రేంజ్ ఎలా ఉందో వీటిని బట్టి అర్థమవుతుంది. ఇటీవల నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించకపోవచ్చు. కానీ.. ఆమె క్రేజ్, అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదు అనడానికి ఇటీవల ఈ భామ హిందీలో షారుఖ్ ఖాన్ సరసన నటించిన జవాన్ ఉదాహరణ. ఈ సినిమా ఎలాంటి సంచలన సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

Nayanthara is unstoppable: After Kamal Haasan's Indian 2, she signs Ajith's  Viswasam - IBTimes India

ఈ నేపద్యంలో నయనతార నటించిన ఉమెన్ సెంట్రిక్ మూవీ మన్నాంగటి సీన్స్ 1960.. సినిమాని కంప్లీట్ చేసింది. మరో పక్క మాధవన్, సిద్ధార్థ హీరోలుగా నటిస్తున్న టెస్ట్ సినిమాలోను నటిస్తుంది. అలాగే మలయాళం లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా తాజాగా హీరో అజిత్ సరసన నటించనుంద‌ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అజిత్, నాయన్ ఇద్ద‌రిది సూపర్ హిట్ కాంబో అనడంలో సందేహం లేదు. వీరిద్దరూ ఇప్పటికే వేగ‌న్, బిల్లా, ఆరంభం, విశ్వాసం.. నాలుగు సినిమాల్లో నటించారు. అయితే వీటిలో వేగన్‌ తప్ప.. మిగిలిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. తాజాగా ఈ జంట ఐదోసారి కలిసి నటించబోతున్నారని తెలుస్తుంది. అజిత్ ప్రస్తుతం విడాముయర్చి సినిమా పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత తన 63వ సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు.

Did Nayanthara Decide Not To Work With A Star Hero Again? - Filmibeat

అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు గుడ్ బాడ్ అగ్లి టైటిల్ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ మూవీలో అజిత్‌.. త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు అందులో ఆయనకు జంటగ టాలీవుడ్ బ్యూటీ శ్రీ లీలా, సిమ్రాన్, మీనా నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఇదే లిస్టులో లేడీ సూపర్ స్టార్ నయన్ ఉందని వార్తలు వినిపించడం విశేషం. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జోరుగా సాగుతున్న ఈ సినిమా జూన్ నెలలో సెట్స్ పైకి రానుంది. ఈ సినిమాసెట్స్‌లో నయనతార మూడు రోజులు పాల్గొంటుందని టాక్. ఆ మూడు రోజుల షూట్‌కోసం రూ.10 కోట్లు చార్జ్ చేస్తుంద‌ని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక అజిత్ రూ.163 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైర‌ల్‌గా మారింది.