బన్నీ రొటీన్, ‘ దేవర ‘150 డేస్ పక్కా.. కుర్చీ తాత షాకింగ్ కామెంట్స్..?!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వ‌చ్చిన‌ గుంటూరు కారంలో శ్రీ‌లీలా హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా భారీ హైప్‌తో రిలీజై ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. కానీ ఈ సినిమాలో కుర్చి మడత పెట్టి సాంగ్ ఏ లెవెల్ లో పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పాటకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా స్టెప్పులు వేశారు. అయితే గుంటూరు కారం సినిమాలో ఈ సాంగ్ పెట్టడానికి కారణం అహ్మద్ కాలాపాషా అనే ఓ తాత అన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో.. కృష్ణకాంత్ పార్క్ సమీపంలో తిరుగుతూ ఉండే ఆ తాత చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ తో పాట మంచి హైప్‌ తెచ్చుకుంది.

కుర్చీ తాత లవ్ స్టోరీ.. ఇది 'బొంబాయి' సినిమా పార్ట్-2 (వీడియో)

ఇతనికి భార్య, పిల్లలు ఉన్న ఇంట్లో వాళ్లను పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతూ వాళ్లని, వీళ్ళని తిడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ ఛానల్ లో ఈ తాత తిట్టిన బూతు డైలాగ్ కూర్చుని మడత పెట్టి.. అంటూ చెప్పినా పదం బాగా వైరల్ గా మారింది. అది కాస్త థ‌మన్ చెవిలో పడడంతో.. ఆయన తన గుంటూరు కారంలో ఆ ప‌దం పెట్టించేసాడు. అంతేకాదో పదాన్ని సినిమాలో వాడుకున్నందుకు కాలాపాషాకు ఆర్థిక సహాయం అందించాడు. అలా తెలుగునాట కుర్చీ తాత రాత్రికి రాత్రి పాపులర్ అయ్యాడు. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ ఇంకోసారి వివాదంలో చిక్కుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కొర‌టాల శివ కాంబో దేవర నుంచి ఇటీవల ఫియర్ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

NTR-Bunny: ఒకే చోట ఇరగదీస్తున్న ఎన్టీఆర్, బన్నీ..!

తారక్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫ్యాన్స్ కు ఈ సాంగ్ తో ట్రీట్ ఇచ్చారు. రామా జోగయ్య రాసిన ఈ పాటకు అనిరుధ్‌ స్వరాలు అందించాడు. అయితే తాజాగా ఈ పాటకి కుర్చి తాత రేవ్యూ ఇస్తూ.. ఎన్టీఆర్ యాక్షన్.. అతని కత్తి పట్టి నరికే సీన్స్ బాగా నచ్చాయని.. తన దృష్టిలో ఎన్టీఆర్ ప్రభాస్ లు కత్తి పట్టుకుంటే బాగుంటుందని.. దేవర కన్ఫామ్ గా 150 రోజులు ఆడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ చాలా మంచోడని.. ఆడపిల్లలకు, అనాధలకు హెల్ప్ చేస్తాడు అంటూ ప్రశంసించిన ఆయన.. అదే టైంలో అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. బన్నీ చేసిందే చేస్తాడు.. కొంచెం మారాలి.. కొడుకుతో ఓవర్ యాక్టింగ్ కాకుండా మంచిగా చేయించాలని అల్లు అరవింద్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు కాలపాషా. ప్రస్తుతం కుర్చితాత చేసిన కమెంట్స్ వైర‌ల్ అవడంతో బన్నీ ఫ్యాన్స్ ఇతనిపై మండిపడుతున్నారు.