ఒకే స్టేజిపై మెరువనున్న చిరు, రజిని, కమల్.. ఇక ఫ్యాన్స్ కు పండగే..?!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేశారు మేకర్స్. చెన్నై నెహ్రూ స్టేడియంలో ఈ వేడుక ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు హాజరు కాబోతున్నారని.. ఇన్విటేషన్ చాలా మందికి అందించారని. అలా ఇన్విటేషన్స్ అందుకున్న వారిలో చిరంజీవి, ఆయ‌న క‌న‌యుడు రామ్ చరణ్ కూడా ఉండడం విశేషం.

RC15 Update: Ram Charan's Shankar Directorial Gets Chiranjeevi On Board For  A Special Part?

తమిళ్ యాక్టర్ రజినీకాంత్ తో కలిసి ఆడియో లాంచ్ కు వీరిద్దరు అతిథులుగా వచ్చి సందడి చేయనున్నారు. ఈ సినిమాలో మొదట సింగిల్ పారా ఇప్పటికే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అనిరుధ్‌ రవిచంద్ర ఈ సినిమాకి స్వరాలు అందించాడు. డైరెక్టర్ శంకర్ సినిమాకు.. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నాడు అంటే సినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం శంకర్ తెలుగులో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్‌కు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Kamal Haasan Meets Rajinikanth, Says No Politics Discussed

అందుకే ఆడియో లాంచ్ కు రామ్ చరణ్ తండ్రి చిరంజీవిని కూడా ఆహ్వానించారు. శంకర్‌తో కలిసి పనిచేసిన రజనీకాంత్ కూడా ఈ కార్యక్రమంలో సందడి చేయనున్నాడు. ఈ ఈవెంట్లో కమలహాసన్ ఎలాగో ఉంటారు. దీంతో ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఒకే వేదికపై కనిపిస్తున్నారని.. తెలియడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఎప్పుడు ఈ ఈవెంట్ జరుగుతుందా.. వారి ముగ్గురిని కలిపి ఒకే ఫ్రేమ్ పై ఎప్పుడు చూస్తామా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది.