‘ సత్యభామ ‘ ట్రైలర్ చూశారా.. యాక్షన్ అవతార్ లో సూపర్ స్టంట్స్ తో కాజల్ దుమ్మురేపిందిగా ( వీడియో)..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటించిన మూవీ సత్యభామ. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది కాజ‌ల్‌. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ గ్రాండ్ లెవెల్ లో లాంచ్ చేశారు. ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కోసం గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా హాజరై సందడి చేశాడు. ఈ ట్రైలర్ కూడా ప్రేక్షకులను అదే రేంజ్‌లో ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే నిన్న మొన్నటి వరకు 31న సినిమా రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేసిన మూవీ టీం.. అదే రోజున మరో నాలుగు సినిమాలు రిలీజ్ ఉండడంతో తర్వాత రిలీజ్ డేట్ ను జూన్ 7కు మార్చారు. సోలో రిలీజ్ గా సత్యభామ రానునట్లు మేకర్స్ వివరించారు.

Satyabhama trailer: Kajal Aggarwal gets into action mode as she chases down a killer | Telugu News - The Indian Express

నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. సుమన్ చిక్కాల డైరెక్షన్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ స్టార్టింగ్‌లో ఒకరిని కాపాడడానికి ప్రయత్నించి విఫలమై.. సస్పెన్స్‌కు గురైన సత్యభామను ఆకట్టుకునేలా చూపించారు. అయితే ఆ అమ్మాయిని హత్య చేసిన హంతకులను పట్టుకోవాలని కసితో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కాజల్. అలాగే ఆ మర్డర్ ఒక పీడకలలా కలలో మెదలుతూ ఉండడం.. మరోవైపు ఆ బాధితురాలీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎదురయ్యే చిత్కారాలతో ఆమెకు హంతకలును పట్టుకోవాలని క‌సి మరింతగా పెరుగుతుంది. ఆ మర్డర్ కేసును పరిష్కరించే క్రమంలో మరో హత్య జరుగుతుంది. వీటిని పరిష్కరించడానికి కేవలం మూడు రోజులు టైం ఇస్తున్నట్లు కాజల్ కు ఆమె హెడ్ ఆదేశాలు పంపిస్తాడు.

Director Anil Ravipudi Speech @ Satyabhama Trailer Launch Event | Kajal Aggarwal | Naveen Chandra - YouTube

ఇక ఈ స‌మ‌స్య‌ పరిష్కరించడానికి సత్యభామ ఏం చేసిందనేది సినిమా స్టోరీ అని అర్థమవుతుంది. ట్రైలర్ తోనే స్టోరీ పై మంచి క్లారిటీ వచ్చింది. ఇక కాజల్ పోషించిన పాత్ర పవర్ఫుల్ ఆఫీసర్ రోల్ కావడంతో.. దానికోసం ఆమె అదే రేంజ్ లో శ్రమించింది. పెళ్ళై ఓ బిడ్డ తల్లి అయిన తర్వాత కూడా చాలెంజింగ్ రోల్స్‌ చేస్తూ ప్రేక్షకుల మెప్పించడం అంటే అంత సులువు కాదు. కానీ కాజల్ మాత్రం దాన్ని ఓ సవాల్ గా తీసుకొని నటిస్తోంది. ట్రైలర్లో ఆమె చేసిన స్టాంట్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను కాజల్ నడిపిందని ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి క్లారిటీ వస్తుంది.