రెండుసార్లు ఆ మూవీకి సీక్వెల్ తెరకెక్కించాలి అని ఆగిపోయిన బాలయ్య ..ఆ సినిమా ఏంటంటే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక బాగా ట్రెండ్ గా .. తంతుగా మారిపోయింది . గతంలో తాము నటించిన సినిమాలను రీ రిలీజ్ పేరిట మళ్లీ రిలీజ్ చేస్తూ ఉండడం . అదేవిధంగా సీక్వెల్స్ పేరిట ఆ సినిమాలకు సెకండ్ మూవీస్ తెరకెక్కిస్తూ ఉండడం . ఈ మధ్యకాలంలో చాలా సినిమాలకు సీక్వెల్స్ వస్తున్నాయి . అలా వచ్చిన సినిమాలు హిట్ అవుతూ ఉండడం గమనార్హం. అయితే బాలయ్య కూడా తన కెరియర్లో ఎంతో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సమరసింహారెడ్డి.. నరసింహనాయుడు మూవీ లకి సీక్వెల్ తెరకెక్కించాలి అని చాలాసార్లు ట్రై చేశారట.

డైరెక్టర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించారట . కానీ కొన్ని కారణాలవల్ల బాలయ్య ఆ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కించే ఆలోచన నుంచి విరమించుకున్నారట . ఒకసారి మనం తెరకెక్కించిన సినిమా మరొకసారి అదే పేరిట..కథలో ట్వీస్ట్ లు పెట్టి తెరకెక్కిస్తే ఏం బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే బాలయ్య నరసింహనాయుడు .. సమరసింహారెడ్డి సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కించకుండా ఆగిపోయారట .

మిగతా హీరోలు కూడా ఈ సినిమాలను టచ్ చేసే అంత స్థాయి లేకపోవడంతో .. ఈ సినిమాలకు సీక్వెల్స్ రాలేకపోయాయి . సినీ ఇండస్ట్రీలో రికార్డ్స్ క్రియేట్ చేయాలి అన్న .. ఆ రికార్డ్స్ బద్దలు కొట్టాలి అన్న .. నందమూరి హీరోల తర్వాతే ఎవరైనా.. ఫ్యూచర్లో ఈ సినిమాలకి మోక్షజ్ఞ ఏమన్నా సీక్వెల్స్ చేసే ఛాన్స్ వస్తాయేమో చూద్దాం..! ప్రసెంట్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడు బాలయ్య..!!