తార‌క్ , చ‌ర‌ణ్‌తో న‌టించాల‌ని ఉంది.. ఆస్కార్ విన్నింగ్ హీరోయిన్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌..

రాజమౌళి దర్శకత్వంలో తారక్, చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్‌ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుందో అందరికీ తెలుసు. ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్‌లోనే కాదు.. ఎంతోమంది హాలీవుడ్ నటుల్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. పలువురు హాలీవుడ్ నటులు, దర్శకులు కూడా చ‌ర‌ణ్‌, తార‌క్ యాక్టింగ్.. రాజమౌళి డైరెక్షన్స్.. స్కిల్స్ పై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఓ ఆస్కార్ విన్నింగ్ హీరోయిన్ చరణ్‌తో కలిసి ఓ సినిమా చేయాలని ఉందంటూ తన కోరికను బయటపెట్టింది. ఆమె ఎవరో కాదు హాలీవుడ్ నటి అన్న హతావే.

Anne Hathaway on 'Princess Diaries 3': 'We're working on it' - UPI.com

ఆమె మాట్లాడుతూ ఆర్‌ఆర్ఆర్ సినిమా గురించి చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారాయి. ఇంటర్స్ టెల్లార్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఆర్‌ఆర్ఆర్ మూవీ తనకు ఎంతగానో నచ్చిందని.. ఈ సినిమా హీరోలతో, టీంతో కలిసి ఒక్క సినిమాలో నటించాలని ఉందంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే ఇప్పటికే చరణ్ తారక్‌ల‌కు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే. ఓ ఆస్కార్ విన్నింగ్ రేంజ్ లో ఉన్న హీరోయిన్.. వీరితో సినిమా చేయాలని ఉందని కోరడంతో.. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వీరిద్దరి ఆ సినిమాలో తమ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆ రేంజ్ లో ఆకట్టుకున్నారు. కనుక ఇన్ని ప్రశంసలు అందుతున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

RRR: Fan CelebRRRation Northwest Public Broadcasting, 44% OFF

ఇక ఈ సినిమాలో నాటునాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమాల ఖ్యాతిని రెట్టింపు చేసిన డైరెక్ట‌ర్‌ల‌లో రాజమౌళి ఒక‌రు అనడంలో సందేహం లేదు. ఇక రాజమౌళి సినిమాలకు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో భారీ క్రేజ్ ఏర్పడింది. తాను మహేష్ తో కలిసి తెరకెక్కించ‌నున్న తన నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఈ సినిమాతో జక్కన్నకు పాల్ వరల్డ్ రేంజ్‌లో సక్సెస్ కాయమంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.