తూచ్..శ్రీలీల వద్దు.. మోక్షజ్ఞ పక్కన ఆ హీరోయిన్ నే కావాలి.. ఫ్యాన్స్ న్యూ డిమాండ్ చూశారా..?

మోక్షజ్ఞ ..బాలయ్య కొడుకు ..ఒక్కగాని ఒక్క ముద్దుల కొడుకు.. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించాలి అని తెగ ప్రయత్నం చేస్తున్నాడు బాలయ్య. అయితే అదృష్టమో దురదృష్టమో ఆ ఎంట్రీ మాత్రం లేట్ అవుతూనే వస్తుంది . నిన్న మొన్నటి వరకు ఆదిత్య 369 సినిమా రీమేక్ గా వచ్చే మూవీతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది . ఆ తర్వాత అఖండ 2 లో ఒక కీలక పాత్ర ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది .

ఇప్పుడు ఏకంగా 2025వ సంవత్సరం వరకు మోక్షజ్ఞ తెర కనిపించడు అంటూ ప్రచారం జరుగుతుంది . తాజాగా సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా హీరోయిన్గా శ్రీలీల అయితేనే బాగుంటుంది అంటూ నందమూరి ఫ్యాన్స్ ఆశపడ్డారు. అయితే శ్రీ లీల క్రేజ్ ఢమాల్ అని పడిపోవడంతో .. ఇప్పుడు ఆ స్థానంలోకి మరో బ్యూటీ వచ్చి చేరినట్లు తెలుస్తుంది.

ఆమె మరెవరో కాదు లేటెస్ట్ సెన్సేషన్ మమితా బైజు. యస్..మలయాళీ బ్యూటీ మమత బైజు మోక్షజ్ఞ కాంబో బాగుంటుంది అని ..జంట చూడ చక్కగా ఉంటుంది అని .. మోక్షజ్ఞ సినిమాలో ఆమె హీరోయిన్ అయితే బాగుంటుంది అని ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు ..ఆమెని సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకోండి సార్ అంటూ సజెస్ట్ చేస్తున్నారు . దీంతో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మరీ ముఖ్యంగా వీళ్ల కాంబోలో సినిమా ని హై రేంజ్ ఉంటుంది అని ప్రశంసిస్తున్నారు..!!