“సక్సెస్ గుండెల్లో పెట్టుకోవాలి బ్రో..తలకి ఎక్కించుకోకూడదు”.. ఆ హీరోకి మహేశ్ ఘాటు కౌంటర్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ టూ యాక్టివ్ అయిపోతున్నారు. మరీ ముఖ్యంగా తమలో ఉన్న టాలెంట్ మొత్తం బయట పెట్టేస్తున్నారు . తాజాగా మహేష్ బాబు కి సంబంధించిన ఒక వార్తను భలే భలే ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు ..ట్రెండ్ కూడా చేస్తున్నారు. అసలు సంబంధమే లేని విధంగా ముడి పెడుతూ మహేష్ బాబును ఆడేసుకుంటున్నారు . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు.

రీసెంట్గా మహేష్ బాబు ఎవరినో టార్గెట్ చేసినట్లు అనిపిస్తుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు . గుంటూరు కారంతో హ్యూజ్ ట్రోలింగ్ కి గురైన మహేష్ తాజాగా కంపెనీ హెడ్గా ఒక ఆఫీసర్ ని లిఫ్ట్ లో తీసుకెళ్లేందుకు యాడ్ చేస్తాడు . లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే అక్కడ పని చేసే వ్యక్తి లిఫ్ట్ ఎక్కబోతాడు.. అప్పుడు ఆ వ్యక్తి నువ్వు తర్వాత రా అంటాడు.. అప్పుడే మహేష్ వస్తాడు ..సార్ రండి రండి అంటాడు .

కానీ మహేష్ నేను తర్వాత వస్తానని చెప్పి.. ఆ పని చేసే వ్యక్తితో కలిసి వెళ్తాడు. ఇక మెసేజ్ విషయానికి వస్తే సక్సెస్ ని “గుండెల్లో పెట్టుకోవాలి తలకెక్కించుకోకూడదు” అంటూ మహేష్ పంచ్ డైలాగ్ విసురుతాడు . కేవలం యాడ్ కోసమే ఈ డైలాగ్ చెప్పినట్లు అనిపించట్లేదు అంటున్నారు ఫాన్స్. ఎవరో ఒక హీరోని బాగా టార్గెట్ చేసి ఘాటుగా రాడ్ దిగేలా యాడ్లో ఆ డైలాగ్ చెప్పినట్లు ఉంది అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ యాడ్ వీడియో వైరల్ గా మారింది..!!