సుకుమార్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా..? కానీ ఇంత వరకు ఆమెతో ఒక్క సినిమా కూడా చేయలేదు..ఎందుకంటే..?

టైం అంటే ఇదే మనకి ఇష్టమైనవన్నీ జరగాలి అనుకోవడంలో తప్పులేదు.. కానీ అలా జరుగుతుంది అని ఆశపడడం మాత్రం తప్పే.. ఎందుకంటే లైఫ్ అంటేనే ఓ అర్థం కాని గజిబిజి గందరగోళం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు ఎవ్వరు గెస్ చేయలేరు . ఇది అందరికీ తెలిసిన సత్యమే . కాగా సుకుమార్ సైతం అలాంటి ఓ కన్ఫ్యూషన్లో ఇరుక్కునేసాడు . సుకుమార్ ఎన్ని సినిమాలను తెరకెక్కించాడో తెలిసిందే. అన్ని సినిమాలు కూడా హిట్ అయ్యాయి అని చెప్పలేం ..

కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . అయితే ఎక్కువ శాతం సినిమాలో మాత్రం హిట్ అయ్యాయి. కాగా సుకుమార్ ఫేవరెట్ హీరోయిన్ సాయి పల్లవి. ఈ విషయాన్ని ఆయనే పలు ఇంటర్వ్యూలలో ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. ఆమె నటన ఆమె సింప్లిసిటీ చాలా బాగుంటుంది అని .. ఆమెకు ఫేవరెట్ పర్సన్ అయిపోయాను అని సుకుమార్ ఏకంగా లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ కూడా ఇచ్చారు .

అయితే సుకుమార్ ఇప్పటివరకు ఆమెతో ఒక్క సినిమా కూడా తెరకెక్కించలేదు . ఫ్యూచర్లో తరకెక్కిస్తాను అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు సుకుమార్ . అయితే పుష్ప2లో ఒక రోల్ ఆఫర్ చేసిన ఆమె రిజెక్ట్ చేసిందట . దాంతో సాయి పల్లవి పై మరింత గౌరవం పెరిగిపోయిందట . ప్రజెంట్ సుకుమార్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీ బిజీగా ఉన్నాడు . ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తూ ఉండగా యానిమల్ బ్యూటీ తృప్తి ఐటమ్ సాంగ్ లో కనిపించబోతుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ పాన్ ఇండియా వైడ్ వైరల్ గా మారింది..!