స్పిరిట్ నుంచి ప్ర‌కాష్‌రాజ్‌ను త‌ప్పించారా.. త‌ప్పుకున్నాడా…?

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల‌లో ‘స్పిరిట్’ కూడా ఒకటి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కంప్లీట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌నుంది. పైగా యానిమ‌ల్ లాంటి పాన్ ఇండియా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత ద‌ర్శ‌కుడు సందీప్ వంగా డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావ‌డంతో స్పిరిట్ మీద అంచ‌నాలు మామూలుగా లేవు. స్పిరిట్ మూవీలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా నుంచి వ‌స్తోన్న వార్త‌ల్లో ఓ విష‌యంలో మేక‌ర్స్ ఫుల్ క‌న్‌ఫ్యూజ్ అవుతున్నారు.

ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ముందు మేక‌ర్స్ నుంచి ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. అయితే ఇటీవ‌ల ఈ సినిమా ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగాతో ప్ర‌కాష్‌రాజ్‌కు గ్యాప్ రావ‌డంతో ఆయ‌న ఈ సినిమా నుంచి త‌ప్పుకున్న‌ట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్త‌ల‌ను మేక‌ర్స్ ఖండించారు. తాజాగా స్పిరిట్ సినిమా నుంచి ఈ సినిమాలో విల‌న్ గా చేస్తోన్న బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన పోస్ట్‌లో ప్రకాష్ రాజ్‌ను ఎక్కడా కూడా ట్యాగ్ చేయక పోవడంతో ఇప్పుడు మ‌ళ్లీ సందేహాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

Spirit: Budget, Prabhas role details and leading actress nameవివేక్ ఒబెరాయ్ లుక్ రిలీజ్‌తో స్పిరిట్ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ నిజంగానే తప్పుకున్నట్లు వార్తలు మరోసారి చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ కన్ఫ్యూజన్‌పై ప్రకాష్ రాజ్ కాని, స్పిరిట్ మేకర్స్ కానీ క్లారిటీ ఇస్తాగాని ఈ పుకార్ల‌కు చెక్ ప‌డేలా లేవు. ఇక స్పిరిట్ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా భద్రకాళి పిక్చర్స్, టి-సిరీస్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.