” కన్నప్ప ” బడ్జెట్ షాకింగ్ డీటెయిల్స్.. ప్రభాస్ కంటే తక్కువ.. పవన్ కంటే ఎక్కువ..!

టాలీవుడ్ మోస్ట్ ప్ర‌స్టీజియ‌స్‌ ప్రాజెక్ట్‌ల‌లో మంను వారి కన్నప్ప మూవీ కూడా ఒకటి. కలెక్షన్ కింగ్‌ మోహన్ బాబు ప్రొడక్షన్ బ్యానర్ పై.. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ మూవీగా ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతోంది. మంచి విష్ణు తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా.. భారీ బడ్జెట్‌తో.. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ ఈ మూవీలో కీల‌క పాత్ర‌లో మెర‌వ‌నున్నారు. అత్యంత ప్రమాణిక విలువలతో.. డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ తెర‌కెక్కించిన ఈ సినిమాను.. ప్రెస్టీజియస్ గా తీసుకున్న విష్ణు.. తన కెరీర్‌లోనే ఇప్పటివరకు లేని రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాలో నటించాడు. ఇక.. ఈ సినిమా ప్రారంభంలో రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న‌ట్లు టాక్ వినిపించగా.. ఆ బడ్జెట్ దాటిపోయి డబల్ అయ్యిందంటూ తాజాగా మంచు విష్ణునే వివరించాడు.

Prabhas Stars in 'The Raja Saab': Motion Poster Unveiled, Release Set for  10 April 2025 "Telugu Movies, Music, Reviews and Latest News"

ఈ క్రమంలోనే బడ్జెట్ పై .ఎదురైన ప్రశ్నకు విష్ణు రియాక్ట్ అవుతూ.. తన సినిమాకు ప్రభాస్ రాజాసాబ్‌ కంటే తక్కువ బడ్జెట్.. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ అయింది అంటూ తన మార్క్ సమాధానాన్ని చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం విష్ణు చేసిన కామెంట్స్ వైర‌ల్ కావ‌డంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. కాగా ప్రభాస్ రాజాసాబ్‌, ఓజి సినిమాలకు బడ్జెట్.. రూ. 300 నుంచి 400 రేంజ్ లో ఉందని టాక్. అంటే.. కన్నప్ప సినిమాకు మినిమం రూ.200 కోట్లు ఖర్చుపెట్టి ఉండాలి. ఇక ఈనెల 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై.. ఊహించిన రేంజ్ లో అయితే హైప్ రాలేదు. సినిమాపై నెలకొన్న ఎంతోకొంత బ‌జ్‌కు మాత్రం.. ప్రధాన కారణం ఈ సినిమాలో ప్రభాస్ నటించడమే.

పవన్​ కల్యాణ్​ 'OG' ఫస్ట్​ సాంగ్​ రిలీజ్​కు ముహూర్తం ఫిక్స్​ - 'ఫైర్​  స్టార్మ్'​ వచ్చేది అప్పుడే!

ఇక త్వ‌ర‌లో సినిమా రిలీజ్ కానున్న క్ర‌మంలో.. ఈ సినిమాపై హైప్‌ పెంచేందుకు మేకర్స్‌.. ప్రమోషన్స్‌ను ఎలా ప్లాన్ చేస్తారో.. ఏ రేంజ్ లో ఆడియన్స్‌లో బజ్ క్రియేట్ చేస్తారో వేచి చూడాలి. ఇక సినిమా రన్టైం తాజాగా మరింత హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా ఏకంగా 3 గంటలు 12 నిమిషాల రన్ టైమ్‌తో తెర‌కెక్క‌నుందని సమాచారం. ఈ క్రమంలోనే ఓ మైథిలాజికల్ స్టోరీ ఎన్ని గంటల నడివితో వస్తే.. అసలు ఆడియన్స్ మెప్పిస్తుందా.. ఈ కాన్సెప్ట్ వర్క్ అవుట్ అవుతుందా.. లేదో అనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజై పాజిటివ్ టాక్‌ తెచ్చుకుంటే మాత్రం.. కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది అనడంలో సందేహం లేదు.