కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా.. అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటించిన తాజా మూవీ కుబేర. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా మెరవనంది. పాన్ ఇండియా లెవెల్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను జూన్ 20న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. అలా.. తాజాగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో గ్రాండ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మేకర్స్ నిర్వహించారు. ఇక ఇందులో స్పెషల్ గెస్ట్‌గా.. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి హాజరై సందడి చేశాడు. ఇక.. ఈవెంట్లో యాంకర్ సుమ.. రాజమౌళితో పాటు.. శేఖర్ కమ్ముల, రష్మిక, ధనుష్, నాగార్జునతోను చిట్ చాట్ నిర్వహించింది. ఇందులో భాగంగా ధనుష్ తన మనసులో మాటలను రివిల్ చేశాడు.
తమిళ్‌లో మీరు ఎంతో మంది తో సినిమాలు తీశారు. తెలుగులో.. దర్శకుడిగా ఏ హీరోతో పనిచేయాలని ఉందని యాంకర్ సుమ ప్రశ్నించగా.. ధనుష్ దానిపై స్పందిస్తూ.. నాకు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని ఉంది అంటూ వెల్లడించాడు. డబ్బు లేకపోయినా మనకు దక్కేది ఏంటని సుమా అడగ్గా.. అమ్మ ప్రేమ అంటూ ధనుష్ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. ఆయన రియాక్ట్ అవుతూ తన విషయంలో.. రూ.150 సంపాదిస్తే.. రూ. 200 సమస్యలు ఉంటాయి. కోటి సంపాదిస్తే రెండు కోట్ల సమస్యలు ఉంటాయంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ధనుష్ చేసిన ఈ కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే.. పవన్ అభిమానులు ధనుష్ కామెంట్స్ పై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఖచ్చితంగా వీళ్లిద్దరు కాంబోలో సినిమా వస్తే బాక్సాఫీస్ బ్లాస్ట్ పక్కా అంటూ.. అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే వేదికపై.. తన డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేసిన ధనుష్.. ఈ సినిమాలో బిచ్చగాడి రోల్‌లో నటించాడు. ఇక తాజాగా రిలీజ్ అయిన పోస్టర్, టీజర్ మూవీ పై ఆడియోస్ లో మరింత ఆసక్తిని పెంచాయి. కుబేరతో పాటు ధనుష్ చేతిలో మరో నాలుగైదు ప్రాజెక్టులు ఉండడం విశేషం. ఇటీవల జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీకి దర్శకత్వం వహించిన ధనుష్ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు.. మరో కొత్త ప్రాజెక్ట్ తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. అలాగే.. అబ్దుల్ కలాం బయోపిక్ లో సైతం ఆయన నటించనున్నాడు. ఇక తెలుగు, తమిళ్‌లోనే కాదు.. హిందీలోను పలు సినిమాల్లో ధనుష్ బిజీబిజీగా గడుపుతున్నాడు. ఎప్పుడో సార్ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించి.. విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ధనుష్.. కుబేరతో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడో వేచి చూడాలి. **