టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా డైరెక్షన్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్న తాజా మూవీ స్పిరిట్. అయితే.. ఈ సినిమాకు హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారని సస్పెన్స్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే సినిమాల్లో హీరోయిన్ ఆమే అంటూ రోజుకో ముద్దుగుమ్మ పేరు వైరల్ గా మారుతుంది. మొదటి మృణాల్ ఠాగూర్ పేరు వినిపించినా.. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ తను కాదని.. గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొనేను హీరోయిన్‌గా నటింపజేయాలని సందీప్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడంటూ టాక్ నడుస్తుంది.
అంతేకాదు.. ఇటీవల ఆమె ఈ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ముంబై సినీ వర్గాల సమాచారం. ఇక ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో సినిమాను అక్టోబర్ లో సెట్స్‌పైకి తీసుకువచ్చేందుకు అన్ని సిధ్ధం చేస్తున్నారు మేకర్స్. మొదట.. ఈ సినిమాలో దీపిక పదుకొనేను హీరోయిన్గా భావించారని.. అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె ప్రాజెక్టు వదులుకుందని టాక్ నడిచింది.
అయితే.. ఇప్పుడు ఆ సినిమా షూట్ ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొనడంతో.. సందీప్ రెడ్డి వంగా కొత్త స్కెడ్యూల్‌తో ఆమెను కలిసాడట. అక్టోబర్ నుంచి తనకు వేరే సినిమాలు కమిట్మెంట్స్ ఏమీ లేకపోవడంతో.. దీపికా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఇక స్పిరిట్ స్టోరీతో పాటూ.. హీరోయిన్ క్యారక్టరైజేషన్ చాలా బాగా నచ్చడంతో ఆ పాత్రలో నటించేందుకు దీపిక వెంటనే ఓకే చెప్పేసిందట. ఈ సినిమాలో ప్రభాస్ ఓ పవర్ఫుల్ కాప్ గా కనిపించనున్నాడు. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమా తెరకెక్కనుంది.