టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జేష్‌లో రాణిస్తున్నాడు. ఇక ఇప్పటికే దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ సక్సెస్ లు అందుకున్న నాని.. ఇటు ప్రొడ్యూసర్ గాను మారి కోర్ట్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అంతేకాదు తాజాగా హిట్ 3 సినిమాతో ప్రొడ్యూసర్ కం హీరోగాను సత్త చాటుకున్నాడు. శైలేష్ కొలను డైరెక్షన్లో రూపొందిన హిట్ 3 సినిమాలో కేజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా మెరిసిన సంగతి తెలిసిందే. ఇక వరుసగా నాలుగు హిట్స్ తో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్న నాని.. నిన్న మొన్నటివరకు లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్టైన సినిమాలను నటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపద్యంలో నాని.. దసరాతో రూట్ మార్చి.. ఊరమాస్ కంటెంట్‌లోకి అడుగుపెట్టాడు. సరిపోదా శనివారంతో తన పర్ఫామెన్స్ అదరగొట్టాడు.
హిట్ 3లో మాస్ కంటెంట్‌తో ఫుల్ మీల్స్ పెట్టేశాడు. స్క్రీన్ పై రక్తపాతం చూపించాడు. దీంతో.. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నాని నుంచి నెక్స్ట్ రానున్న మూవీ.. ది పారడైజ్. శ్రీకాంత్ ఓద్దెల డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు మొదలయ్యాయి. దసరా లాంటి భారీ సక్సెస్ ఇచ్చిన తర్వాత.. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు ఇప్పటికే మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇక సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ అయితే.. నెటింట సంచలనం సృష్టించాయి. అయితే.. సినిమాలో వచ్చే పలు డైలాగ్స్, అసభ్య పదజాలం మాత్రం కాస్త అందరికీ షాక్‌గా అనిపించింది.
ఇక.. నాని ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలకు పూర్తి భిన్నంగా రా అండ్ రెస్ట్రిక్ మోడ్‌లో ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇక సినిమా ఫుల్ లెవెల్ లో సెట్స్‌పైకి రాకముందే.. సినిమాకి సంబంధించిన న్యూస్ ఫిలిం సర్కిల్స్ తెగ చక్కర్లు కొడుతుంది. మూవీ ఆడియో రైట్స్ విషయంలో భారీ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఈ సినిమా ఆడియో రైట్స్‌ను సరిగమ.. గ్లోబల్ సంస్థ దక్కించుకుందట. దీనికోసం ఏకంగా రూ.18 కోట్ల చెల్లించారని సమాచారం. సినిమా ఇంకా పూర్తికాకముందే ఈ రేంజ్‌లో ఆడియో రైట్స్ బిజినెస్ జరగడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నాని.. ఫ్యాన్స్ అయితే ఈ వార్తతో పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో నాని తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించనుందని టాక్. అంతేకాదు.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ పాత్రలో మెరవనున్నరట. ఇప్పటికే ఆయన ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారని సమాచారం.