ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి క్లాప్ అసిస్టెంట్ నుంచి స్టార్ హీరోగా ఎదుగాడు నాని. ప్రస్తుతం ప్రొడ్యూసర్ గాను తన హవా చూపిస్తున్నాడు. ఇక ఆయన సక్సెస్ కు.. హార్డ్ వర్క్, నాచురల్ నటన ప్రధాన కారణాలు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అష్ట చమ్మ సినిమాతో హీరోగా మారిన నాని.. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకోవడమే కాదు.. నటనకు ప్రశంసలు దక్కించుకున్నాడు. తర్వాత వచ్చిన అలా మొదలైంది, భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమిందార్ సినిమాలను ఆయన హీరోగా మరో రేంజ్‌కు తీసుకెళ్ళాడు. ఈ క్రమంలోనే రాజమౌళి దృష్టిని ఆకట్టుకున్న నాని.. ఈగ సినిమాలో అవకాశాన్ని కొట్టేసాడు. ఈ సినిమాలో నాని పాత్ర నడివి తక్కువ అయినా.. కెరీర్ పరంగా సినిమా మరింత ప్లస్ అయింది.
అయితే.. ప్రతి స్టార్ హీరో లానే ఈయన లైఫ్‌లోను ఫ్లాప్‌లు ఉన్నాయి. కాగా వరుస ఫ్లాప్‌లు ఎదుర్కొంటున్న సమయంలోను స్ట్రాంగ్‌గా ఇండస్ట్రీలో నిలబడ్డాడు. తర్వాత ఆయనకు వరుస సక్సెస్ లు వరించాయి. ప్రస్తుతం ఇదే ఫార్ములాతో దూసుకుపోతున్న నాని.. తాజాగా హిట్ 3 సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గాను నాని వ్యవహరించారు. దీంతో పాటు చివరిగా.. కోర్ట్ సినిమాకు కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరించి.. రెండు సినిమాలు తోనూ మంచి సక్సెస్ అందుకున్నాడు. అయితే హిట్ 3 మిక్స్డ్ టాక్ వచ్చిన భారీ ఓపెనింగ్స్ దక్కడానికి కారణం నాని శ్రమ.
ఆఫ్ స్క్రీన్‌లో కూడా ఆయన హిట్ 3 కోసం ఎంతగానో కష్టపడ్డాడు. ఒక సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్‌లో చేయాలో 100% ఎఫర్ట్‌స్ పెట్టి ప్రమోషన్స్ లో సందడి చేశాడు. ఇక సినిమా ప్రమోషన్స్ లో రాజమౌళి మాస్టర్ అనడంలో సందేహం లేదు. బాహుబలి సిరీస్ ని ఏ రేంజ్ లో ప్రమోట్ చేశాడో.. సినిమా మార్కెటింగ్ ఎఫర్ట్స్ వివరాలు చూస్తే తెలుస్తుంది. అలాంటిది నాని సైతం మార్కెటింగ్ ఎఫర్ట్స్ అని హిట్ 3 సినిమాతో నిరూపించుకున్నాడు. ఓ విధంగా చెప్పాలంటే రాజమౌళికి ఆయన మంచి పోటీ ఇస్తున్నారు అనడంలో సందేహం లేదు. నిర్విరామంగా హిట్ 3 ప్రమోషన్స్ చేసి.. చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని మీడియాలకు ఇంటర్వ్యూ ఇచ్చి సినిమాపై ఆసక్తి పెంచాడు.
ఎన్నో నగరాలను సందర్శించి.. మీడియా ఫ్లాట్ ఫార్ములాలను ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా రిలాక్స్ కాకుండా మార్కెట్‌ను మరింతగా పెంచే ప్రయత్నంలో భాగంగా డల్లాస్ వెళ్ళాడు. దాని ఎఫర్ట్స్ వీడియోస్.. మార్కెట్ పై పడింది. ఈ క్రమంలోనే హిట్ 3 యూఎస్ లో రికార్డ్ స్థాయి వసూలు కొల్లగొడుతుంది. సినిమా నటించేశామా, రిలాక్స్ అయ్యామా.. అని తేలికగా వదిలేయకుండా ప్రమోషన్స్‌తో ఈ రేంజ్‌లో పెట్టడం నానికి మాత్రమే చెల్లింది. ఈ క్రమంలోనే మార్కెటింగ్ ఎఫర్ట్స్‌లో నాని రాజమౌళికి పోటీ ఇస్తున్నాడంటూ.. ఇది కదా సూపర్ హీరో లక్షణం అంటూ తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.