చరణ్ దెబ్బకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ పక్కానా..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గ్లోబల్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చరణ్.. మెగాస్టార్ బ్రాండ్‌తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా పిస‌రంత‌ గర్వం కూడా లేకుండా రేంజ్‌ చూడకుండా అందరిని సమానంగా గౌరవిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ప్రారంభంలో హీరో మెటీరియల్ కాదని.. అసలు యాక్టింగ్ గా రాదంటూ విమర్శించిన వారితో సైతం తమ నటనతో సత్తా చాటుకుని ప్రశంసలు దక్కించుకున్నాడు.

ఇక ఆయన చేసిన ప్రతి సినిమాతో వైవిధ్యమైన కథ అంశాలను ఎంచుకుంటూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో పెద్ది సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తనకంటూ ప్రత్యేక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని కసితో ఉన్నాడు. ఇక తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2తో.. రూ.1850 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. మరి ఈ సినిమా రికార్డును బ్రేక్ చేసేలా చరణ్ పెద్ది సినిమా రూపొందించనున్నట్లు సమాచారం.

You will love it, says Ram Charan about the first shot of 'Peddi'

చరణ్ కు మొదటి నుంచి ఇత‌రుల‌తో పోటీ ప‌డ‌టానికి ఇష్ట‌ప‌డ‌డు. తను ఏంటో.. తాను ప్రూవ్ చేసుకోవాలని సినిమాల్లో నటిస్తాడు తప్ప.. ఎవరికి సవాళ్లు విస‌రరు. ఈ క్రమంలోనే సినిమాలపరంగా తాను నెంబర్ వన్ పొజిషన్‌లో ఉండాలని మాత్రం ఆరాటపడుతూ ఉంటారు. అందుకే కథ‌లని ఎంచుకునే విధానంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయడానికి కష్టపడతాడు. ఈ క్రమంలోనే చరణ్ నెక్స్ట్ సినిమాలతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని.. బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అంటుకుంటుందో చూడాలి.