రీ రిలీజ్ లో ” ఖలేజా ” విధ్వంసం.. మహేష్ కలెక్షన్ల ఊచకోత..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కొన‌సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో రిలీజై బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలతో పాటు.. ఫ్లాప్ సినిమాలు కూడా థియేటర్లలో రీ రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్. అలా ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. గతంలో ఫ్లాపులుగా నిలిచిన సినిమాలు సైతం రీ రిలీజ్‌లో మంచి రిజల్ట్ అందుకుంటున్నాయి. అలా.. తాజాగా దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా.. మహేష్ ఖలేజా సినిమాను నేడు(మే 30)న‌ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

Mahesh Babu Khaleja's Re-Release Pulls In Audiences | Filmfare.com

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో.. మహేష్ హీరోగా రూపొందిన ఈ కల్ట్‌ క్లాసికల్ మూవీ.. 15 సంవత్సరాల తర్వాత నేడు థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలోనే.. మొదటి రోజే సినిమా అన్నిషోలు హౌస్ ఫుల్ పడిపోతున్నాయి. చిన్న చిన్న పల్లెటూరులో సైతం సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలతో పాటు సెకండ్ గ్రేడ్‌ నగరాల్లో సైతం.. బి సెంటర్లు, సి సెంటర్లు కూడా ఖలేజా రీ రిలీజ్‌కు సిద్ధం అయ్యాయి. టాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ ఏకంగా రూ.8 కోట్ల వరకు జరిగిందట. దీన్నిబట్టి ఖలేజా ఏ రేంజ్ లో విధ్వంసం సృష్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక 15 సంవత్సరాల క్రితం భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్ల వద్ద డీలపడిన సంగతి తెలిసిందే.

Naveen (@Naveen63094400) / X

మహేష్ బాబును ఎప్పుడు చూడని కామెడీ జోనర్లో ఆడియన్స్ కు చూపించే ప్రయత్నం చేశాడు త్రివిక్రమ్. అప్పట్లో మహేష్ ని అలా చూడడం ఆడియన్స్‌కు అస‌లు నచ్చలేదు. పైగా.. ఈ సినిమాకు పోటీగా రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన రోబో, ఎన్టీఆర్.. బృందావనం సినిమాలు రిలీజ్ అయ్యి.. సూపర్ హిట్ టాక్‌ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలోనే ఖలేజా ఫ్లాప్ గా నిలిచింది. అయితే.. తర్వాత బుల్లితెరపై టెలికాస్ట్ అయినా ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ రిజల్ట్‌ను అందుకుంది. భారీ టిఆర్పితో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే ఖలేజా రీ రిలీజ్‌లోను సంచలనం సృష్టించడం ఖాయం అనేలా రెస్పాన్స్ వస్తుంది. కచ్చితంగా ఈ సినిమాతో మహేష్ కలెక్షన్ల ఊచకోత ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.