బాలయ్య ‘ అఖండ 2 ‘.. ఆ మాస్ ట్విస్ట్ కు మైండ్ బ్లాక్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం రాజకీయాలతో పాటు.. సినిమాల్లోను జోరు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు హిట్లతో మంచి ఫామ్‌లో ఉన్న బాలయ్య.. ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్‌లో ఆఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్నాడు. వరుస ఫ్లాపుల‌లో కూరుకుపోయిన బాల‌య్య‌కు స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చి.. రికార్డుల క‌లెక్ష‌న్‌లు కురిపించిన అఖండకు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

Balayya's "Akhanda 2" to hail temples, religious practices

సినిమాల్లో మొదటి భాగంలో లానే బాలయ్య రెండు వైవిద్యమైన షేడ్స్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే.. బాలయ్య అభిమానులకు బోయపాటి ఓ మాస్ ట్విస్ట్ ఇచ్చేందుకు ప్లాన్ చేశాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే.. బాలయ్య ఈ సినిమాలో రెండు షేడ్స్‌లో కాదు.. అభిమానులకు మాస్ ఫీస్ట్ ఇచ్చేలా మైండ్ బ్లోయింగ్ లుక్ లో కనిపించనున్నాడట. ఈ రోల్ ఫ్యాన్స్ కు ఊహించని సర్ప్రైజ్ కానుందని టాక్.

Akhanda 2 Hindi: Can Boyapati Srinu Repeat Sukumar?

ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ టీజర్ జూన్‌లో బాలయ్య పుట్టినరోజు సందర్భంగా.. రిలీజ్ చేయనున్నారని టాక్ వైరల్‌గా మారుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ ధ‌మన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. 14 రీల్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తుంది. ఈ క్రమంలోనే అఖండ 2తో అభిమానులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించేందుకు టీమ్ సిద్ధమవుతుంది. ఇక బాలయ్య అభిమానులకు మాస్ ఫిస్ట్ ఇచ్చే మూడో లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో వేచి చూడాలి.